MP video: టీచర్‌పై ఓల్డ్ స్టూడెంట్స్ దాడి.. హడలెత్తిపోయిన అమ్మాయిలు
- టీచర్‌పై ఓల్డ్ స్టూడెంట్స్ దాడి
- హడలెత్తిపోయిన అమ్మాయిలు
- సీసీ కెమెరాలో దృశ్యాలు నిక్షిప్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లో ఓ విద్యార్థుల గుంపు రెచ్చిపోయింది. ఏకంగా కోచింగ్ సెంటర్‌లోకి ప్రవేశించి గణిత ఉపాధ్యాయుడ్ని బెదిరింపులకు దిగారు. టీచర్ కూడా వారిని ధీటుగానే ఎదుర్కొన్నాడు. ప్రతిదాడిలో టీచర్‌కు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు క్లాస్ రూమ్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Ambani Sangeet Party: అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ సంగీత్ లో బాలివుడ్ తారల హంగామా..
Also Read
సందీప్ శుక్లా అనే వ్యక్తి గణితశాస్త్ర ఉపాధ్యాయుడు. మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు సందీప్ క్లాస్ నిర్వహిస్తున్నాడు. ఇంతలో ముగ్గురు కుర్రాళ్లు ముఖాలకు ముసుగులు ధరించి.. బయటకు రావాలని బెదిరింపులకు పాల్పడ్డారు. చొక్కా కాలర్ పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు. ఇంతలో అక్కడే ఉన్న రాడ్‌ను సందీప్ తీసుకుని.. దుండగులపై దాడి చేశారు. ప్రతి ఘటనలో రాడ్ కింద పడిపోవడంతో నిందితులు తీసుకుని ఎటాక్ చేశారు. కోచింగ్ సెంటర్ బయట జనాలు చూసిన దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. టీచర్‌పై దాడి చేసింది పాత స్టూడెంట్‌గా గుర్తించారు. ఒక విద్యార్థినిపై దాడి చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అతడ్ని క్లాస్ నుంచి సందీప్ బహిష్కరించాడు. దీన్ని మనసులో కక్ష పెంచుకుని… స్నేహితుల్ని వెంటేసుకుని దాడికి పాల్పడ్డాడు.
ఇది కూడా చదవండి: Hardeep Singh Nijjar: కెనడా రాజకీయ నాయకుడికి ఖలిస్తానీ నిజ్జర్ నుంచి నిధులు..
ఇక టీచర్ సందీప్.. సీసీటీవీ ఫుటేజీ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. అయితే దాడి జరుగుతున్నప్పుడు క్లాస్‌లో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు హడలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#WATCH | Youth Barges Into Coaching Class With His Friends In Morena, Attacks Former Math Teacher With Stick#MPNews #MadhyaPradesh pic.twitter.com/cxBEroPAKr
— Free Press Madhya Pradesh (@FreePressMP) July 6, 2024
తాజావార్తలు
-
UPI Transactions: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?