Bengaluru Traffic: బెంగళూరులో ట్రాఫిక్ జామ్.. వాహనాలను వదిలేసి నడిచి వెళ్లిన ప్రయాణికులు
- బెంగళూరులో భారీగా ట్రాఫిక్ జామ్..
- వాహనాలను వదిలేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బెంగళూరు ట్రాఫిక్ జామ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Traffic: భారతదేశంలో ట్రాఫిక్ జామ్ అంటే తొలుత గుర్తొచ్చేది కర్ణాటక రాజధాని బెంగళూరే. కొద్దీ దూరానికే గంటలు గంటలు వేచి చూడటం బెంగళూరు వాసులకు అలవాటుగా మారిపోయింది. ట్రాఫిక్‌తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల జాబితాలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో బెంగళూరు ఉంది. సాధారణ సమయంలోనే ఇలా ఉంటే.. ఇక వరుస సెలవులు, భారీ వర్షాలు కురిసినప్పుడు అక్కడ పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మహా నగరం మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. కిలో మీటరు దూరానికి గంటల తరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రజలు తమ ట్రాఫిక్ కష్టాలను సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు.
Read Also: OnePlus 13 Lauch: ‘వన్‌ప్లస్ 13’ వచ్చేస్తోంది.. ట్రిపుల్ కెమెరా, జంబో బ్యాటరీ!
Also Read
- Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
- Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
- NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
అయితే, తాజాగా బెంగళూరు నగరంలో మరోసారి అలాంటి ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. బుధవారం సాయంత్రం మహానగరంలో భారీ వర్షం పడింది. దీంతో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టెకీలంతా తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఫ్లైఓవర్‌పై పెద్ద ఎత్తున జామ్ నెలకొంది. దాదాపు మూడు గంటలకు పైగా ఫ్లైఓవర్‌పైనే ప్రయాణికులు చిక్కుకుపోయిన పరిస్థితి. దీంతో విసుగు చెందిన కొందరు వాహనాలను వదిలి పెట్టి నడుచుకుంటూ ఇంటికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక, భారీ వర్షాలకు బెంగళూరు నగరం అతలాకుతలమైంది. అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ప్రధాన రహదారులన్నీ మోకాళ్లలోతు నీటిలోనే నదులను తలపిస్తున్నాయి. దాంట్లో ప్రజలు రాకపోకలు సాగిస్తూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ వర్షాలకు ఇప్పటి వరకూ 5 మంది చనిపోయినట్లు సమాచారం.
Completely Jammed from past 1.5 hrs in the #electroniccity flyover. I must have reached my home now which is 30kms away. Logged out at 5:20 and we are still stuck! We can see most of the employees of various companies frustrated and starting to walk. @madivalatrfps pic.twitter.com/wqvXuIArN6
— Maria Stefina! 🤍 (@MariaStefina) October 23, 2024
తాజావార్తలు
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
-
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్‌కు 51 ఏళ్లు
-
South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్‌కు సెకండ్ హోమ్‌గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
-
One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
-
శ్రావణంలో నాన్‌వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్‌కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!