Chhattisgarh: మధ్యాహ్న భోజనం తిన్న వీధి కుక్క.. 78 మంది విద్యార్థులకు రేబిస్ టీకా
- ఛత్తీస్‌గఢ్‌లో మధ్యాహ్న భోజనం తాకిన వీధి కుక్క..
- కుక్క తాకిన ఆహారాన్ని విద్యార్థులకు వడ్డించిన ఎస్‌హెచ్‌జీ సిబ్బంది..
- 78 మందికి యాంటీ రాబీస్ టీకాలు వేయించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బలోడబజార్ జిల్లాలోని లాచాన్పూర్ గ్రామంలోని ప్రభుత్వ మిడిల్ స్కూల్లో స్టూడెంట్స్ కోసం వండిన ఆహారాన్ని ఓ వీధి కుక్క ముట్టుకుంది. దీనిని గమనించిన విద్యార్థులు ఈ విషయాన్ని టీచర్లకు చెప్పినప్పటికీ, వారు పట్టించుకోలేదు. దీనికి తోడు ఆహారాన్ని వండిన స్వయం సహాయక బృందం (ఎస్‌హెచ్‌జీ) ఈ ఆహారం ఏమీ కలుషితం కాలేదని స్టూడెంట్స్ కు వడ్డించింది. ఇక, ఈ ఘటన వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన ఎస్చ్జీ ఆ రోజు మధ్యాహ్న భోజనం చేసిన 78 మందికి యాంటీ రాబీస్ టీకాలు వేయించింది.
Also Read
- Prahlad Joshi: ప్రధాని నమ్మకానికి కృతజ్ఞతలు.. బాధ్యతాయుతంగా పనిచేస్తా..
- Prahlad Joshi: ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై మోడీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు.. ప్రహ్లాద్ జోషి రాజకీయ ప్రస్థానం
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
ఇక, ఈ ఘటన తరువాత స్టూడెంట్స్ తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాఠశాల నిర్వహణ కమిటీని ప్రశ్నించారు. ఎస్‌హెచ్‌జీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ కమిటీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టేందుకు ఉప-డివిజనల్ మేజిస్ట్రేట్ దీపక్ నికుంజ్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నరేష్ వర్మ, ఇతర అధికారులు సదరు స్కూల్ ను సందర్శించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఇక, ఎస్‌హెచ్‌జీ సభ్యులు అధికారుల ఎంక్వైరీలో పాల్గొనలేదు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే సందీప్ సాహు రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్‌కి లేఖ రాశారు. ఈ వివాదంపై సమగ్రమైన విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Anahat Singh: భారత స్క్వాష్‌లో చరిత్ర సృష్టించిన అనాహత్ సింగ్.. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ కైవసం
-
ICC T20 Rankings: ఇంగ్లాండ్‌కు చెక్.. సిరీస్‌తో పాటు ఐసీసీ అగ్రపీఠం దక్కించుకున్న టీమిండియా..
-
RC17 Update: RC17పై బిగ్ అప్డేట్.. స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. షూటింగ్ ఎప్పటి నుంచంటే?
-
Prahlad Joshi: ప్రధాని నమ్మకానికి కృతజ్ఞతలు.. బాధ్యతాయుతంగా పనిచేస్తా..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!