Internet Shutdown: శ్రీనగర్‌లో ఇంటర్నెట్ క్లోజ్.! భారీ నిరసనలతో అలజడి.!
- భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- పుకార్ల నివారణకే నిర్ణయం.. భద్రతా వర్గాల స్పష్టం
- రోడ్లపై నిరసనకారులు.. కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం
- కర్ఫ్యూ తరహా ఆంక్షలు.. అదనపు బలగాల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం జమ్మూ కాశ్మీర్లో తీవ్ర అలజడి సృష్టించింది. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించారన్న వార్త తెలియగానే శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో ప్రజలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారకుండా ఉండేందుకు, శాంతిభద్రతలను కాపాడేందుకు అధికారులు శ్రీనగర్ అంతటా మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు లోయలో అదనపు భద్రతా బలగాలను మోహరించారు.
Vishnu Vinyasam: బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు హవా.. రెండు రోజు కలేక్షన్ ఎంత అంటే..?
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
శ్రీనగర్‌తో పాటు కాశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. భద్రతా బలగాల చర్యలను నిరసిస్తూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్ట్‌లు వెలువడకుండా ఉండేందుకు అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను స్తంభింపజేశారు.
అకస్మాత్తుగా ఇంటర్నెట్ నిలిపివేయడంతో శ్రీనగర్ నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ సేవలు, విద్యార్థుల చదువులు , బ్యాంకింగ్ లావాదేవీలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడమే కాకుండా, అదనపు బలగాలను మోహరించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు సూచించారు. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ లాంటి ఆంక్షలు కూడా విధించినట్లు సమాచారం. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, పుకార్లను నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి శ్రీనగర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, భద్రతా బలగాలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి.
Vishnu Vinyasam: బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు హవా.. రెండు రోజు కలేక్షన్ ఎంత అంటే..?
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!