Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chirag Paswan Death Threat: మంత్రులు, సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు.. ఇక, పలువురు వీఐపీలకు కూడా గతంలో ఎన్నో బెదిరింపు లేఖలు వచ్చాయి.. అయితే, ఇప్పుడు కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్‌కు హత్య బెదిరింపులు రావడం కలకలం రేపింది. మంగళవారం సెప్టెంబర్ 1న పోస్టు ద్వారా వచ్చిన సంతకం లేని లేఖలో ఆయనను త్వరలోనే “హార్డ్‌కోర్ ఉగ్రవాదులు చంపేస్తారు” అంటూ బెదిరించినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. చిరాగ్ పాస్వాన్ ప్రస్తుతం కేంద్ర హోంశాఖ అందిస్తున్న Z కేటగిరీ భద్రతలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన బెదిరింపు లేఖను ఆయన కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. లేఖలో రెండు మొబైల్ నంబర్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
హోంశాఖకు అత్యవసర లేఖ
బెదిరింపు లేఖ అందిన వెంటనే చిరాగ్ పాస్వాన్ కార్యాలయం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అలోక్ కుమార్‌కు లేఖ రాసింది. బెదిరింపు లేఖ మూలం, దాని ప్రామాణికత, దాని వెనుక ఉన్న పరిస్థితులపై తక్షణమే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరింది. కేంద్ర మంత్రి వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అత్యంత తీవ్రమైన అంశంగా దీనిని పరిగణించాలని లేఖలో పేర్కొన్నారు. అసలు బెదిరింపు లేఖను కూడా అధికారుల పరిశీలన కోసం హోంశాఖకు జత చేసినట్లు తెలిపారు.
Also Read
భద్రతను సమీక్షించాలని విజ్ఞప్తి
బెదిరింపు నేపథ్యంలో చిరాగ్ పాస్వాన్‌కు ప్రస్తుతం ఉన్న భద్రతా ఏర్పాట్లను మరోసారి సమీక్షించాలని ఆయన కార్యాలయం కోరింది. అవసరమైతే భద్రతను మరింత పెంచాలని విజ్ఞప్తి చేసింది. చిరాగ్ పాస్వాన్‌కు భవిష్యత్తులో పలు బహిరంగ కార్యక్రమాలు, ప్రజా సమావేశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ముప్పు పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భద్రతను తగిన విధంగా పెంచాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.
బెదిరింపు నిజమేనా? దర్యాప్తు తర్వాతే స్పష్టత
ప్రస్తుతం అందిన బెదిరింపు లేఖ నిజమైనదా? దాని వెనుక ఎవరు ఉన్నారు? అందులో పేర్కొన్న మొబైల్ నంబర్లకు, బెదిరింపులకు ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాలపై అధికారుల దర్యాప్తు కొనసాగాల్సి ఉంది. లేఖ మూలం, ప్రామాణికతపై పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ వ్యవహారాన్ని అత్యంత అత్యవసరంగా, ప్రాధాన్యతతో పరిగణించి వెంటనే చర్యలు తీసుకోవాలని చిరాగ్ పాస్వాన్ కార్యాలయం కేంద్ర హోంశాఖను కోరింది. ప్రస్తుతం బెదిరింపుల మూలం, వాటి విశ్వసనీయతపై మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!