పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగడం లేదు… పెగాసస్ వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలను కుదిపేస్తూనే ఉంది… ఇవాళ కూడా లోక్‌సభ, రాజ్యసభలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.. పార్లమెంట్‌లో విపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి.. రాజ్యసభలో విపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. పెగాసస్ ప్రాజెక్టు నివేదికపై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు.. మరోవైపు.. లోక్‌సభలోనూ అదే పరిస్థితి.. దీంతో.. ఉభయసభలను వాయిదా వేశారు. మొదట ఉభయసభలు 12 గంటల వరకు వాయిదా పడగా.. తిరగి ప్రారంభమైన తర్వాత కూడా అదే సీన్ రిపీట్ కావడంతో మళ్లీ వాయిదా పడ్డాయి.