Chinmayi Sripaada: ఒకే వేదికపై స్టాలిన్, కమల్ హాసన్, వైరముత్తు.. లైంగిక వేధింపుదారుడంటూ సింగర్ చిన్మయి ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinmayi Sripaada: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో తమిళ పాటల రచయిత వైరముత్తుపై ఆమె లైంగిక ఆరోపణలు చేశారు. తనను వేధించినట్లు చిన్మయి ఆరోపించింది. ఇదిలా ఉంటే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ నేత పి. చిదంబరం, ప్రముఖ నటుడు కమల్ హాసన్‌తో కలిసి వైరముత్తు ఒకే వేదికను పంచుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి సంబంధించిన ఫోటోను సోమవారం ట్వీట్ చేసిన చిన్మయి తీవ్ర స్థాయిలో స్పందించారు.
‘‘ నాపై నిషేధం ఉన్న సమయంలో తమిళనాడులోని అత్యంత శక్తివంతమైన కొందరు వ్యక్తులు నన్ను వేధించించిన వ్యక్తితో వేదిక పంచుకున్నారు.. నా కెరీర్‌లో కొన్ని ఏళ్లను నేను కోల్పోయాను’’ అని చిన్మయి ట్వీట్ చేశారు. వైరముత్తు ‘మహా కవితై’ అనే పుస్తక ఆవిష్కరణ సందర్భంగా స్టాలిన్, చిదంబరం, కమల్ హాసన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: Delhi Crime: 26 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్, బ్లాక్‌మెయిల్..
39 ఏళ్ల చిన్మయి, తనపై వైరముత్తు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. 2018లో #MeToo ఉద్యమ సమయంలో వందలాది మంది బాధితులు తమపై జరిగిన లైంగిక వేధింపులపై పెదవి విప్పారు. ఈ నేపథ్యంలో చిన్మయి తాజాగా వైరముత్తుతో పొలిటికల్, సినీ యాక్టర్లు వేదిక పంచుకోవడాన్ని విమర్శించారు. ‘‘ సెక్స్ నేరస్తులను ప్రోత్సహించే, మద్దతు ఇచ్చే మొత్తం వ్యవస్థ ఈ క్షణం నుంచి నాశనమైపోతుంది, నా కోరిక నెరవేరే దాకా నేను ప్రార్థిస్తాను, ప్రార్థిస్తూనే ఉంటాను- ఏమైనప్పటికీ నేను చేయగలిగింది ఏమీ లేదు’’ అంటూ ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
2019లో వైరముత్తుపై ఆరోపణలు చేసిన ఏడాది తర్వాత, మీడియా మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించారు. చాలా మంది వైరముత్తుకు రక్షణగా నిలుస్తున్నారంటూ ఆరోపించారు. డీఎంకేలోని చాలా మంది తనకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. వారి చేతులు కట్టేసి ఉన్నాయని ఆమె అన్నారు. ప్రభుత్వ మౌనాన్ని ప్రశ్నిస్తూ గతంలో సీఎం స్టాలిన్‌కి చిన్మయి లేఖ రాశారు. ఇప్పటి వరకు 17 మంది మహిళలు వైరముత్తుపై వేధింపుల ఆరోపణలు చేశారు.
Some of the most powerful men in Tamilnadu platforming my molester whilst I got banned – years of my career lost.
May the entire ecosystem that promotes and supports sex offenders whilst incarcerating honest people who speak up start getting destroyed from this very moment,… https://t.co/J7HcqJYAcV
— Chinmayi Sripaada (@Chinmayi) January 1, 2024
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!