అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణంపై సింగపూర్ పోలీసులు కీలక సమాచారాన్ని అందించింది. జుబీన్ గార్గ్ మరణం విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాలు కనిపించలేదని.. దర్యాప్తు జరుగుతోందని సింగపూర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కేసు ప్రస్తుతం సింగపూర్ కరోనర్స్ చట్టం ప్రకారం దర్యాప్తులో ఉందని.. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఎటువంటి అనుమానం రాలేదని సింగపూర్ పోలీసులు తెలిపారు. ‘‘ఈ కేసుపై సమగ్రమైన, వృత్తిపరమైన దర్యాప్తు నిర్వహించడానికి కట్టుబడి ఉన్నాం. దీనికి సమయం పడుతుంది. ధృవీకరించని సమాచారాన్ని ఊహాగానాలు చేయవద్దని, వ్యాప్తి చేయవద్దని మేము ప్రజలను కోరుతున్నాము.’’ అని సింగపూర్ పోలీసులు ప్రకటనలో తెలిపారు. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ అక్టోబర్ 1న పోస్టుమార్టం కాపీని, ప్రాథమిక దర్యాప్తును భారతదేశానికి పంపినట్లు సింగపూర్ పోలీసులు తెలిపారు. దర్యాప్తునకు మూడు నెలల సమయం పడుతుందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: IRCTC: పనిచేయని ఐఆర్సీటీసీ వెబ్సైట్.. దీపావళి ప్రయాణికుల ఆందోళన
జుబీన్ గార్గ్ (52) సింగపూర్‌లోని నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు వెళ్లారు. సెప్టెంబర్ 19న సముద్రంలో ఈత కొడుతూ ప్రాణాలు కోల్పోయారు. జుబీన్ గార్గ్ మరణంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. దీంతో అస్సాం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తులో భాగంగా ఈవెంట్ నిర్వాహకుడు శ్యామ్కాను మహంత, మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, బంధువు సందీపన్ గార్గ్, నందేశ్వర్ బోరాతో సహా ఇద్దరు పీఎస్వో సహా ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే జుబీన్ గార్గ్‌పై విష ప్రయోగం జరిగిందని జుబీన్ గార్గ్ బ్యాండ్‌మేట్ ఆరోపించాడు. ప్రస్తుతం ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Tollywood Diwali Clash: దీపావళి ధమాకా.. మూడు రోజుల్లో నలుగురు యంగ్ హీరోల భవితవ్యం.. టాలీవుడ్లో గట్టి పోటీ!