Neha Murder Case: నేహ తండ్రికి క్షమాపణ చెప్పిన సీఎం సిద్ధరామయ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neha Murder Case: కర్ణాటక హుబ్బళ్లిలో ఎంసీఏ విద్యార్థిని నేహ హత్య ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్ కుమార్తె అయిన నేహను కాలేజ్ క్యాంపస్‌లోనే ఫయాజ్ అనే వ్యక్తి కత్తితో కిరాతకంగా దాడి చేసి చంపాడు. ఈ ఘటన బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. కాంగ్రెస్ ఇది వ్యక్తిగత హత్య అని చెబుతుంటే, బీజేపీ మాత్రం ఇది ‘లవ్ జిహాద్’ అని ఆరోపించింది. మరోవైపు నేహ తండ్రి కూడా తన కుమార్తెను చాలా రోజులుగా ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం సంచలనంగా మారింది.
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి కస్టడీ పొడగింపు.. మరో 14 రోజులు జైలులోనే..
Also Read
- Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
ఈ నేపథ్యంలో నేహకు న్యాయం జరగాలని బీజేపీ, రైట్ వింగ్ సంస్థలు హుబ్బళ్లితో పాటు కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు తెలిపాయి. ఆదివారం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా నేహా తండ్రి కాంగ్రెస్ కార్పొరేటర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించడంతో పాటు సీబీఐ ఎంక్వైరీ కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు నిందితుడు ఫయాజ్ తల్లిదండ్రులు.. నేహా కుటుంబాన్ని తమను క్షమించాలని కోరారు. నేహ తమ కూతురులాంటిదని వ్యాఖ్యానించారు. అయితే, వీరిద్దరు గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్‌తో కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మాట్లాడారు. ఈ ఘటనకు ఆయన క్షమాపణలు కోరడంతో పాటు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మంగళవారం హుబ్బళ్లిలోని ఆయన నివాసంలో నిరంజన్ హిరేమఠ్‌ను పరామర్శించగా.. ఫోన్‌లో మాట్లాడిన సీఎం క్షమాపనలు కోరారు. ఈ కేసులో సిద్ధరామయ్య సీఐడీ విచారణను కోరారు. నేరం తీవ్రమైందని, నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని అన్నారు.
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!