Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీ కాలంలో సగం కాలం పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో సీఎం మార్పు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతుదారులు ఆయన తదుపరి సీఎం కావాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం రాష్ట్ర నాయకత్వ మార్పుపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Pakistan: పాక్ ఆర్మీ, ప్రభుత్వం మధ్య విభేదాలు.. ఆఫ్ఘాన్‌తో ఘర్షణ పెంచుతున్న ఆసిమ్ మునీర్..
‘‘మీకు అడగటానికి ఇకేం ప్రశ్నలు లేవా..? ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దాని గురించి మాట్లడనివ్వండి. కానీ హైకమాండ్ ఎవరు.? దీని గురించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మాట్లాడారా..’’ అని విలేకరిని సీఎం అడిగారు. ‘‘మీరు ఎప్పుడూ దీని గురించే ఎందుకు మాట్లాడుతున్నారు..? ఇప్పుడు ఈ ప్రశ్న అడగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.? హైకమాండ్ కాకుండా దీని గురించి ఎవరు మాట్లాడినా ప్రాముఖ్యత ఉండదు’’ అని ఆయన అన్నారు.
నవంబర్ 6,11 తేదీల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రి వర్గం పునర్వ్యవస్థీకరణ గురించి హైకమాండ్‌తో మాట్లాడుతానని సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2023లో ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అప్పుడు కాంగ్రెస్ శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించింది. దీంతో ఇరువురు నేతల మధ్య పదవీకాలం సమానంగా పంచుకోవాలనే ప్రతిపాదన వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తానే 5 ఏళ్లు పదవిలో ఉంటానని ఇటీవల సిద్ధరామయ్య చెప్పారు.
