Shubhanshu Shukla: చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా.. ఐఎస్ఎస్‌తో ఆక్సియం-4 డాకింగ్..
- చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా..
- ఐఎస్ఎస్‌కి చేరిన ఆక్సియం-4..
- అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఘనత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టి శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఆయన ఘటన సాధించారు. ఆక్సియం-4 ఐఎస్ఎస్‌తో డాక్ అయింది. దాదాపు నెల రోజుల ఆలస్యం, అనేక వాయిదాల తర్వాత జూన్ 25న స్పేస్‌ఎక్స్ డ్రాగన్ ఫ్లైట్ ఆక్సియం-4 విజయవంతంగా అంతరిక్షంలోకి బయలుదేరింది. ఇలా ఐఎస్ఎస్ చేరుకున్న మొదటి భారతీయుడి రికార్డు కూడా శుభాన్షు శుక్లా ఖాతాలో చేరింది.
Read Also: IFSC Code: ఐఎఫ్ఎస్ సి కోడ్ అంటే ఏమిటి? ఇది ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసా?
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
- PM Modi: AI, డేటా, గవర్నెన్స్‌పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
28 గంటలు ప్రయాణించిన డ్రాగన్ అంతరిక్ష నౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)ను చేరుకుంది. భూమికి 418 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ, గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఐఎస్ఎస్ ని చేరుకోవడానికి అంతరిక్ష నౌక అనేక విన్యాసాలు చేయాల్సి వచ్చింది. ఆక్సియం-4 బృందం ఐఎస్ఎస్‌లో దాదాపు 14 రోజులు ఉంటారు. అక్కడ ఉన్న సిబ్బందితో కలిసి పనిచేస్తారు. 60 కంటే ఎక్కువ సైన్స్ ఎక్సపరిమెంట్స్ నిర్వహిస్తారు. క్యాన్సర్ పరిశోధన, డీఎన్ఏ రిపేర్ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి.
భారత్ నుంచి శుభాన్షుతో పాటు పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నియెవ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు అమెరికాకు చెందిన కమాండర్ పెగ్గీ విట్సన్ ఈ వ్యోమనౌక ద్వారా ఐఎస్ఎస్ చేరుకున్నారు. మిషన్ పైలట్ అయిన శుక్లా, అంతరిక్షంలోక వెళ్లిన రెండో భారతీయుడిగా హిస్టరీ క్రియేట్ చేశారు. అంతకుముందు 1984లో వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లారు. దాదాపుగా 4 దశాబ్ధాల తర్వాత మరో భారతీయులు స్పేస్‌లోకి ప్రవేశించారు.
WATCH | #Axiom4Mission successfully docks at the International Space Station. The Mission has been piloted by India's Group Captain #ShubhanshuShukla
(Video: NASA via Reuters) pic.twitter.com/B9kXGc45kA
— ANI (@ANI) June 26, 2025
తాజావార్తలు
-
YS Jagan: వైఎస్ జగన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్‌పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!