UGC: 18 వైద్య కాలేజీలపై యూజీసీ కొరడా.. షోకాజ్ నోటీసులు జారీ
- 18 వైద్య కాలేజీలపై యూజీసీ కొరడా
- షోకాజ్ నోటీసులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా 18 వైద్య కళాశాలపై యూజీసీ కొరడా ఝుళిపించింది. ర్యాగింగ్ నిరోధక చర్యలు పాటించని కాలేజీలపై సీరియస్ అయింది. దీంతో దేశ వ్యాప్తంగా 18 కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జాబితాలో ఆంధ్రప్రదేశ్, బీహార్ నుంచి మూడు చొప్పున కాలేజీలు ఉండగా.. అస్సాం, ఢిల్లీ, తమిళనాడు, పుదుచ్చేరి నుంచి రెండేసి కాలేజీలు ఉన్నాయి. ఇక మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ నుంచి ఒక్కో కాలేజీ చొప్పున ఉన్నాయి. ఏపీ నుంచి ఆంధ్రా మెడికల్ కాలేజ్ (విశాఖ), గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్ ఉండగా.. తెలంగాణ నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉండటం విశేషం. ర్యాగింగ్ వ్యతిరేక చర్యలను అడ్డుకోకపోవడంతోనే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Anji Reddy : ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది చాలా విలువైన పాత్ర..
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
నిబంధనల ప్రకారం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి యాంటీ ర్యాగింగ్ డిక్లరేషన్‌ను పొందడంలో విఫలమైనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ నోటీసు అందిన తేదీ నుంచి ఏడు రోజుల్లోగా సరైన కారణాలను, లోపాల్ని సరిదిద్దుకోవాలని.. తీసుకున్న చర్యల్ని వివరిస్తూ లిఖితపూర్వక వివరణ పంపాలని ఆదేశించినట్లు మనీష్ జోషి తెలిపారు. నిర్దేశిత గడువు లోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Delhi Elections: ఆప్ అంచనాలు తల్లకిందులవుతున్నాయా? దానికి కారణమిదేనా?
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!