NTV Telugu Site icon

Sanjay Raut: బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం.. మహా వికాస్‌ అఘాడీలో లుకలుకలు

Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: మహారాష్ట్రలోని విపక్ష మహా వికాస్‌ అఘాడీ (శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ), కాంగ్రెస్‌) కూటమి మధ్య లుకలుకలు బయటకు వస్తున్నాయి. వచ్చే ఏడాది జరగబోయే బృహణ్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎంవీఏ మిత్ర పక్షంతో పొత్తు పెట్టుకోవడం కష్టమేనని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నామని సూచనలు చేశారు.

Read Also: Game Changer : గేమ్ ఛేంజర్ ఈవెంట్లో పవర్ స్టార్ మేనియా

అయితే, దేశ వాణిజ్యరాజధాని ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ను శివసేన ఏకంగా 25 ఏళ్ల పాటు నిర్విరామంగా పరిపాలన కొనసాగించిందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. 1997 నుంచి 2022దాకా బీఎంసీపై శివసేన పట్టుకొనసాగింది. కానీ, ఈసారి మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమిగా కాకుండా ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుదామన్నారు.. ఒంటిగా పోటీ చేయాలని మా శివసేన కార్యకర్తలు పట్టుబడుతున్నారు.. అందుకే వారితో ఈ అంశాన్ని చర్చించేందుకు పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారని వెల్లడించారు. ఇక, ఎంవీఏ కూటమిలో విభేదాలున్నాయన్న వాదనను సంజయ్ రౌత్‌ తోసిపుచ్చారు.

Read Also: Mohali Building Collapse: పంజాబ్‌లో కుప్పుకూలిన మూడంతస్తుల భవనం.. 15 గంటలకు రెస్క్యూ ఆపరేషన్

కాగా, శివసేన రెండుగా చీలకముందు కూడా మేం గతంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న సందర్భాల్లోనూ బీఎంసీ ఎన్నికల్లో మేం ఒంటరిగా పోటీ చేశామని ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. పుణె, పింప్రి–చించ్వాడ్, నాసిక్‌ పురపాలిక ఎన్నికల్లో ఎంవీఏ కూటమి ఉమ్మడిగానే బరిలోకి దిగనుందని ప్రకటించారు. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మాదిరే అజిత్‌ పవార్‌ సారథ్యంలోని ఎన్సీపీ, బీజేపీలతో శివసేన ఉమ్మడిగా మహాయుతి కూటమిగా బీఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే స్పష్టం చేశారు.

Show comments