Shinzo Abe: షింజో అబే హత్యకు అగ్నిపథ్ పథకానికి ముడిపెడుతూ కథనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీంకు ప్రచురితమైన ఓ కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కథనాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధికార పత్రిక ‘జాగో బంగ్లా’ వెలువరించింది. షింజో అబే హత్య ఘటన అగ్నిపథ్‌పై వ్యతిరేకతను బలపరుస్తుందని ఈ బెంగాలీ కథనం పేర్కొంది. ఎందుకంటే.. షింజో అబేను హతమార్చిన టెత్సుయా యమగామి జపాన్ నావికా దళంలో మూడేళ్లపాటు పని చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం లేకుండా.. పెన్షన్ రాకుండా ఇబ్బంది పడ్డాడని చెప్పుకొచ్చింది. ఆ కోపంతోనే షింజోను కాల్చి చంపేశాడు అంటూ సదరు కథనం హాట్ చర్చకు దారితీసింది. ‘భారత్ కూడా తాజాగా రక్షణ బలగాల్లో ఇదే తరహా నియామకాలు చేపడుతోంది. దీనికింద అభ్యర్థులు కేవలం నాలుగున్నరేళ్లు మాత్రమే విధుల్లో ఉంటారు. ఆ తర్వాత పెన్షన్ ఉండదు. పదవీ విరమణ అనంతరం ఇతర ప్రయోజనాలు దక్కవు’ అని ‘జాగో బంగ్లా’ పత్రిక ప్రచురించిన కథనంలో పొందుపర్చింది.
Shinzo Abe: భద్రతా వైఫల్యం వల్లే షింజో అబే హత్య..
Also Read
మోదీ ప్రభుత్వం కూడా యువతను రక్షణ దళంలో నాలుగేళ్ల పాటు పని చేయించుకుని.. పెన్షన్, ఇతర రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ లేకుండా చూడాలని ప్రయత్నిస్తోందని, భవిష్యత్తులో భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చంటూ ఆ కథనంలో కేంద్రంపై విమర్శలు గుప్పించింది. మరోవైపు శుక్రవారం ఘటన జరిగిన కొన్ని గంటలకే.. కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్‌పుత్ కూడా దాదాపు ఇలాంటి అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేశాడు. కాంగ్రెస్ నేత ట్వీట్‌తో పాటు టీఎంసీ అధికార పత్రిక జాగో బంగ్లా కథనంపై బీజేపీ మండిపడింది. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారంలో ఉన్న షింజో అబే శుక్రవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. దుండగుడు వెనక నుంచి కాల్పులు జరపడంతో ఆయన కుప్పకూలారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?