Sheikh Hasina: బెంగాల్ సీఎం సువేందుపై షేక్ హసీనా ప్రశంసలు..

Sheikh Hasina

Sheikh Hasina

Sheikh Hasina: బెంగాల్‌లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. సువేందు అధికారి తొలి బీజేపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉంటే, బీజేపీ ఘన విజయం, సువేందు అధికారిపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రశంసలు కురిపించారు. బెంగాల్‌లో బీజేపీ విజయం, సువేందు అధికారి ప్రజాకర్షణ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది అని ఆమె అన్నారు. బంగ్లాదేశ్ ప్రజల తరఫున, వ్యక్తిగతంగా తాను సువేందును హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

Read Also: Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్‌కు వీసీకే మద్దతు

పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే బంగ్లా అక్రమ చొరబాటుదారులు, మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇలాంటి సమయంలో షేక్ హసీనా నుంచి ప్రశంసలు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఆందోళనల తర్వాత షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచి భారత్‌కు వచ్చి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ ఆమెపై తీవ్రమైన నేరాలు మోపడంతో పాటు ఆమె పార్టీ గుర్తింపును రద్దు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. ప్రస్తుతం తారిఖ్ రెహ్మన్ నేతృత్వంలోని బీఎన్పీ అక్కడ అధికారంలో ఉంది.