Congress: కేరళ రాష్ట్రంలోని యూడీఎఫ్ నేతల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన వైపే మొగ్గు చూపుతున్నారనే సర్వే బయటకు వచ్చిందంటూ లోక్‌సభ ఎంపీ శశిథరూర్ చేసిన పోస్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.. మొదట ఆయన ఏ పార్టీలో కొనసాగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది. ఇక, సర్వేల్లో ఎవరో ఒకరు మొదటి వరుసలో ఉంటారు.. కానీ, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వస్తే, దానికి చెందిన వ్యక్తే చీఫ్ మినిస్టర్ అవుతారు.. మా అసలు టార్గెట్ ఎన్నికల్లో విజయం సాధించడమే.. శశిథరూర్ అనవసర వివాదాలు సృష్టించొద్దు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.మురళీధరన్ స్పష్టం చేశారు.
Read Also: Shakib Al Hasan: సొంత దేశం పొమ్మంది.. పొరుగు దేశంలో అదరగొడుతున్న సీనియర్ ప్లేయర్..!
ఇక, ఎంపీ శశిథరూర్‌కు కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. పార్టీ నేతలకు, ఆయనకు మధ్య వరుసగా విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదే, సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ శశిథరూర్ ఓ వ్యాసం రాశారు. దీనిపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ.. కొందరికి మోడీనే ప్రాధాన్యమంటూ మండిపడ్డారు. దీనికి కౌంటర్‌గా థరూర్ ఓ పక్షి ఫొటోను షేర్ చేసి.. ఎగరడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు.. రెక్కలు నీయి.. ఆకాశం ఎవరి సొంతం కాదు అనే సందేశాన్ని రాసుకొచ్చాడు. శశిథరూర్ మెసేజ్ పై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. ఎగరడానికి పర్మిషన్ అడగొద్దు.. కానీ, ఈ రోజుల్లో స్వేచ్ఛగా ఎగిరే పక్షి కూడా ఆకాశాన్ని నిశితంగా గమనించాలి.. ఆ పక్షులను ఎల్లప్పుడూ గద్దలు, రాబందులు వేటాడుతూనే ఉంటాయని సూచించారు.
