NCP Crisis: పవార్ వర్సెస్ పవార్.. పోటాపోటీగా విప్ జారీ చేసిన రెండు వర్గాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCP Crisis: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) రాజకీయంలో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్ గా వ్యవహారం నడుస్తోంది. ఎన్సీపీ పార్టీలో అజిత్ పవార్ చీలిక తీసుకువచ్చారు. అజిత్ పవార్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కు షాక్ ఇస్తూ.. బీజేపీ-షిండే ప్రభుత్వంలో చేరారు. ఆయన ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు మరో 8మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రభుత్వంలో చేరారు.
Read Also: Pedda Amberpet: మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారయత్నం.. కాపాడిన హిజ్రా
Also Read
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
- Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు ఈ రోజు సమావేశాలకు పిలుపునిచ్చాయి. ఇరు పక్షాలు సమావేశాలకు హాజరుకావాలని విప్ జారీ చేశాయి. శరద్ పవార్ వర్గం దక్షిణ ముంబైలోని వైబి చవాన్ సెంటర్లో మధ్యాహ్నం 1 గంటలకు సమావేశానికి పిలుపునిచ్చింది, అజిత్ పవార్ బృందం ఉదయం 11 గంటలకు సబర్బన్ బాంద్రాలోని ముంబై ఎడ్యుకేషన్ ట్రస్ట్ (MET) ప్రాంగణంలో సమావేశమవుతుంది. శరద్ పవార్ వర్గానికి చీఫ్ విప్‌గా పనిచేస్తున్న జితేంద్ర అవద్, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఫీస్ బేరర్లను సమావేశానికి హాజరు కావాలని కోరారు. మరోవైపు అజిత్ పవార్ వర్గానికి చెందిన విప్ అనిత్ పాటిల్ కూడా అందరూ హాజరు కావాలని విప్ జారీ చేశారు. ఈ సమావేశాల తర్వాత ఏ వర్గానికి ఎంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందనే విషయం స్పష్టమయ్యే అవకాశం ఉంది.
మహరాష్ట్రలో ప్రస్తుతం ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అజిత్ పవార్ తనకు మొత్తం 40 మంది కన్నా ఎక్కువ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. అయితే శరద్ పవార్ వర్గం మాత్రం అజిత్ పవార్ వర్గానికి కేవలం 13 మంది ఎమ్మెల్యే మద్దతు మాత్రమే ఉందని చెబుతోంది. ఫిరాయింపు నిరోధక చట్టంలోని నిబంధనలను తప్పించుకోవాలంటే అజిత్ పవార్ కి కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అజిత్ పవార్ వర్గానికి 36 మంది ఎమ్మెల్యేలు మద్దతు లేఖపై సంతకం చేశారని వాదిస్తుండగా.. బీజేపీ అజిత్ పవార్ వర్గానికి 40 మందికి పైగా మద్దతు ఉందని వ్యాఖ్యానిస్తోంది. శరద్ పవార్ ఎంతో నమ్మకంగా ఉన్న 8 మంది ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేరారు.
తాజావార్తలు
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
-
Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
-
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్‌కు కాటేరమ్మ కొడుకు దూరం..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!