NTV Telugu Site icon

Rahul Gandhi: హిందుత్వ హింసపై వివాదం.. రాహుల్కు మద్దతుగా జ్యోతిర్ మఠం శంకరాచార్య..!

Shankarchrya

Shankarchrya

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ లో ఇటీవల చేసిన హిందుత్వ హింస కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఉత్తరాఖండ్ లోని జ్యోతిర్ మఠం 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద రియాక్ట్ అయ్యారు. ఈ విషయంలో రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. హిందుత్వాన్ని తప్పుబట్టేలా రాహుల్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. హిందూ మతంలో హింసకు తావులేదని రాహుల్ సరిగ్గానే చెప్పారు.. అతడి ప్రసంగంలోని వ్యాఖ్యలను ఎడిట్ చేసి అర్ధ సత్యాలు ప్రచారం చేశారన్నారు. అలాంటి వ్యక్తులను కఠింగా శిక్షించాలని అవిముక్తేశ్వరానంద స్వామి డిమాండ్ చేశారు.

Read Also: Instagram Reels: అయ్యిందా బాగా అయ్యిందా.. ఇప్పుడు చల్లు రోడ్డుపై నోట్లు..

అయితే, రాహుల్ గాంధీ ప్రసంగంలోని ‘హింసాత్మక’ వ్యాఖ్యలు కేంద్రంలోని ఓ పార్టీని ఉద్దేశించి చేసినవే తప్ప హిందుత్వం గురించి కాదని జ్యోతిర్ మఠం శంకరాచార్య స్వామి తేల్చి చెప్పారు. దీనిపై రాహుల్ కూడా వివరణ ఇచ్చారు.. మతం ముసుగులో హింసను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీని ఉద్దేశించే తాను ఆ కామెంట్స్ చేసినట్లు చెప్పారని స్వామిజీ గుర్తు చేశారు.

Read Also: PekaMedaluTrailer: వెధవ పనులు చేసేటప్పుడు పది మందికి తెలియకుండా చేయాలి..

కాగా, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ నెల 2వ తేదీన జరిగిన చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు దేశ ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తున్నారని ఆరోపణలు చేశారు. తమను తాము హిందువులమని చెప్పుకొనే కొందరు 24 గంటలూ హింస, ధ్వేషం, అసత్యం గురించే మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా అధికార పార్టీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. దేశంలోని హిందువులందరినీ హింసకు పాల్పడే వారిగా రాహుల్ అవమానించారంటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో రాహుల్ గాంధీ ప్రసంగంలోని ఆ భాగాన్ని స్పీకర్ ఓం బీర్లా రికార్డుల నుంచి తొలగించింది.

Show comments