Prajwal Revanna: మాజీ ప్రధాని మనవడిపై లైంగిక వేధింపుల కేసు.. దుమారం రేపుతున్న అసభ్యకర వీడియోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajwal Revanna: కర్ణాటకలో బీజేపీ మిత్రపక్షం జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ వివాదంలో ఇరుకున్నాడు. అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దేవెగౌడ కొడుకు హెచ్‌డీ రేవణ్ణ ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల మహిళ రేవణ్ణతో పాటు అతడి కొడుకు ప్రజ్వల్ రేవణ్ణపై ఫిర్యాదు చేశారు. కర్ణాటకలో అశ్లీల వీడియోలు దుమారం చెలరేగింది. వీటిలో ఎంపీ ప్రజ్వల్ ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు ఇంటిలో సహాయకురాలిగా పనిచేసే ఒక మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. 47 ఏళ్ల మహిళ తన ఫిర్యాదులో ప్రజ్వల్ తండ్రి హోలెనరసిపూర్ ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణను నిందితుడిగా పేర్కొంది.
Read Also: RCB vs GT: ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. బెంగళూరు ఘన విజయం
Also Read
- Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
హెచ్‌డీ రేవణ్ణ, ప్రజ్వల్ తమ ఇంట్లో మహిళా వర్కర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. పనిలో చేరిన నాలుగు నెలల తర్వాత తనను రేవణ్ణ గదికి పిలుస్తూనే ఉన్నాడని, ఇంట్లో మొత్తం ఆరుగురు ఆడ పనివాళ్లు ఉన్నారని, వారు ప్రజ్వల్ ఇంటికి వస్తే భయపడిపోయేవారమని చెప్పేవారని, ఇంట్లో మగ పనివారు కూడా మహిళ వర్కర్లను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు ఫిర్యాదుదారు చెప్పారు. హెచ్‌డీ రేవణ్ణ భార్య ఇంట్లో లేని సమయంలో మహిళ వర్కర్లనున స్టోర్ రూంకి పిలిచి, వారికి పండ్లు ఇస్తూ వారిని ముట్టుకునే వాడని, చీర పిన్నులు తీసేసి, వారిపై లైంగిక వేధింపులకు పాల్పడే వాడని ఆమె తెలిపింది. ప్రజ్వల్ రేవణ్ణ తన కుమార్తెతో సరసాలాడేందుకు ప్రయత్నించాడని, ఆమె అతని నంబర్‌ను బ్లాక్ చేసిందని ఆ మహిళ పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్లు 354ఏ, 354డీ, 506, 509 కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు అశ్లీల వీడియోల కేసు దుమారం చెలరేగడంతో ప్రజ్వల్ భారత్ వీడినట్లు తెలుస్తోంది. ఆయన బెంగళూర్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్ బయలుదేరి వెళ్లారు. ఈ కేసును విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలు ముఖ్యంగా హసన్ జిల్లాలో ప్రచారంలోకి వచ్చాయి. అయితే, రేవణ్ణ పేరు చెడగొట్టేందుకు మార్ఫ్‌డ్ వీడియోలను హసన్ ఎంపీ స్థానం పరిధిలోని నవీన్ మరికొందరు ఓటర్లకు పంపించారని జేడీఎస్-బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ పూర్ణచంద్ర గౌడ ఫిర్యాదు చేశారు.
- Tags
- bjp
- Deve Gowda
- HD Revanna
- JDS
- karnataka
తాజావార్తలు
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్‌కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!