Yatra-2 Motion Poster: నేను విన్నాను, నేను ఉన్నాను.. యాత్ర-2 మోషన్ పోస్టర్ రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yatra-2 Movie Motion Poster Released: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా ‘యాత్ర’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో మలయాళ హీరో మమ్ముట్టి హీరోగా వచ్చిన యాత్ర సినిమా మంచి విజయం సాధించింది. మహీ వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కింది. సీక్వెల్ కూడా ఉంటుందని డైరెక్టర్ రాఘవ్ గతంలోనే ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఇటీవలే విడుదల చేశారు. నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా యాత్ర-2కు సంబంధించి మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
1 నిమిషం 11 సెకండ్ల నిడివి గల యాత్ర-2 మోషన్ పోస్టర్.. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతి విగ్రహం సీన్‌తో ఆరంభం అవుతుంది. ‘నమస్తే బాబు.. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా నమస్తే.. నమస్తే..’ అనే మాటలతో మోషన్ పోస్టర్ ప్రారంభం అవుతుంది. ఇక ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలతో వీడియో ముగుస్తుంది. మోషన్ పోస్టర్‌లో తండ్రీకొడుకులు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Also Read
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీ తదితర అంశాలను యాత్ర 2లో డైరెక్టర్ మహీ వి రాఘవ్ చూపించనున్నారని తెలుస్తోంది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారి పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మోషన్ పోస్టర్‌లో ఫేస్ సరిగా కనిపించకపోవడంతో క్లారిటీ రాలేదు. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. శివ మేక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Also Read: Disadvantages Of Yogurt: పెరుగుతో పాటు వీటిని అస్సలు తినొద్దు.. భారీ మూల్యం తప్పదు!
Also Read: SIIMA Awards 2023: సైమా వేడుకలకు ముహూర్తం ఫిక్స్.. హోస్ట్‌గా టాలీవుడ్ హీరో!
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?