Jammu Kashmir: పాక్‌కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్‌పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
- జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం..
- అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక ప్రకటన..
- పాకిస్తాన్‌కు మంట పుట్టించేలా గోర్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తు్న్న ఆయన బుధవారం శ్రీనగర్‌ను సందర్శించారు. కాశ్మీర్ చేరుకున్న తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం’’ అని ఆయన కీలక ప్రకటన చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒక అమెరికా రాయబారి కాశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి.
శ్రీనగర్‌కు చేరుకున్న వెంటనే, అమెరికా రాయబారి సెర్గియో గోర్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కలిశారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో, ఇద్దరు నాయకులు పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఎక్స్‌లో సెర్గియో గోర్, కాశ్మీర్ అభివృద్ధి, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. 15 ఏళ్లలో అమెరికా రాయబారి, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మధ్య జరిగిన తొలి ప్రత్యక్ష సమావేశం ఇదే. 2011లో చివరిసారిగా అప్పటి అమెరికా రాయబారి తియోతీ రోమర్ అప్పుడు సీఎంగా ఉన్న ఒమర్ అబ్దుల్లాను కలిశారు.మరోవైపు, ఈ సమావేశంపై స్పందించిన ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. కాశ్మీర్ సమస్యల్ని అమెరికా పరిష్కరించడని, కేంద్రమే పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.
Also Read
సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌కు ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయి. పాకిస్తాన్‌కు అమెరికా మిత్రదేశంగా ఉంది. ఇటీవల ట్రంప్, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఇలాంటి సమయంలో అమెరికా రాయబారి ఈ వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్‌ను ఇరుకునపెట్టేలా ఉన్నాయి.
తాజావార్తలు
-
Jammu Kashmir: పాక్‌కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్‌పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
Nidhhi Agerwal: బెట్టింగ్ యాప్స్ కేసులో నిధి అగర్వాల్‌కు ఈడీ షాక్: 4 గంటల పాటు ప్రశ్నల వర్షం!
-
Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
-
Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
-
Akshaye Khanna: అసుర గురువుగా బాలీవుడ్ స్టార్.. ‘మహాకాళి’ నుంచి ఆగస్టు 24న అదిరిపోయే సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!