Senior advocate R Venkataramani appointed Attorney General of India: భారత అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. దేశ అత్యతున్నత న్యాయ అధికారిగా వెంకటరమణి అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఉన్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. దీంతో కొత్త అటార్నీ జనరల్ గా వెంకటరమణి బాధ్యతలు స్వీకరించనున్నారు.