Bihar Elections: మలి విడత పోలింగ్ ప్రారంభం.. ఓటేసేందుకు క్యూ కట్టిన ఓటర్లు
- మలి విడత పోలింగ్ ప్రారంభం
- ఓటేసేందుకు క్యూ కట్టిన ఓటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహర్‌లో మలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌ల దగ్గర క్యూ కట్టారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొదటి విడతలో 121 స్థానాల్లో ఓటింగ్ జరగగా.. రెండో విడతలో 122 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.
‘సీమాంచల్’ పోలింగ్‌పై ప్రాధాన్యత…
Also Read
మలి విడతలో ‘సీమాంచల్’ పోలింగ్‌పై ప్రాధాన్యత సంతరించుకుంది. సీమాంచల్ అనగానే ఆర్జేడీకి కంచుకోటలాంటిది. ఇక్కడ ఆర్జేడీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 42 స్థానాల్లో విజయం సాధించగా.. ఆర్జేడీ 33, జేడీయూ 20, కాంగ్రెస్ 11, వామపక్షాలు 5 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిగా ఉన్నప్పుడు 80 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ కేవలం 36 స్థానాలకే పరిమితం అయింది. సీమాంచల్‌లో ఎక్కువుగా ముస్లింలు, యాదవ్‌లు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో మహాఘట్‌బంధన్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: పేలుడులో డెలవరీ బాయ్ సజీవదహనం.. అనుమానితుడు అరెస్ట్..
మలి విడతలో మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఎన్నికల బరిలో 1,302 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా… ఇందులో ప్రత్యేకగా 136 మంది మహిళా అభ్యర్థులు ఉండటం విశేషం. 176 మందిని ఎన్నికల పరిశీలకులుగా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అలాగే గట్టి పోలీస్ బందోబస్త్‌ను కూడా ఏర్పాటు చేసింది. దీపావళి, ఛత్ పండుగ కోసం బీహారీయులంతా సొంత గ్రామాలకు రావడంతో భారీగా పోలింగ్ నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎవరికి వారే విజయాలపై అంచనాలు వేసుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: SSMB 29 : GlobeTrotterపై ప్రియాంక చోప్రా స్పెషల్ వీడియో..
తాజావార్తలు
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!