2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన శతృఘ్న సిన్హా ఆ తరువాత బీజేపీని వదలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో కూడా దూరంగా ఉంటున్న శతృఘ్న సిన్హా మరోసారి పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, ఈసారి ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్లో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
Read: ఏపీ ఫైబర్ నెట్ లో వందల కోట్ల మేర అక్రమాలు జరిగాయి…
జులై 21 వ తేదీన ఆయన తృణమూల్లో చేరాలని ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి ఢీకోట్టే నాయకురాలిగా మమతా మారబోతున్నారనే సంకేతాలు వస్తున్న తరుణంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. శతృఘ్నసిన్హా తృణమూల్ చేరే అవకాశాలు ఉన్నాయని అటు ఆ పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి.