BJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ‘‘జెన్-జీ’’ కాదు.. తిరంగాతో సానుభూతి యత్నం!
- సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ కస్టడీపై బీజేపీ నేత సంబిత్ పాత్ర వ్యాఖ్యలు..
- జాతీయ జెండాను అడ్డుపెట్టుకుని సానుభూతి పొందే ప్రయత్నం..
- జాతీయ జెండాను ఎగరేసినందుకు కాదు, శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకే జైలు..
- రాంకా, దాస్‌లో జెన్-జీ కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌ను జాతీయ జెండా ఎగరేసినందుకు పోలీసులు కస్టడీలోకి తీసుకోలేదని, గతంలో వారు సంతకం చేసిన ‘‘శాంతి ఒప్పందాన్ని’’ ఉల్లంఘించినందుకు జ్యుడీషియల్ కస్టడీకి పంపించారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. భువనేశ్వర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీజేపీ నేతలు తిరంగాను ఎగరేయకుండా అడ్డుకున్నారనే తప్పుడు కథనాన్ని ప్రచారం చేసేందుకు కొంత మంది పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం జాతీయ జెండాను ఎగరేయడాన్ని అడ్డుకుందని, నియంతృత్వంగా వ్యవహరిస్తోందనే తప్పుడు అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ల వయసు 27,31 ఏళ్లని, వీరు జెన్-జీ కాదని ఆయన అన్నారు. ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణలో ఇద్దరి గుర్తింపు, వయసు అంశాలపై న్యాయమూర్తి ప్రశ్నలు లెవనెత్తారని తెలిపారు. వీరిద్దరిని అక్టోబర్ 10న మొదట అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొనమని ‘‘పీస్ బాండ్’’పై సంతకం చేసి విడుదలయ్యారని సంబిత్ పాత్ర చెప్పారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే బాండ్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ఆయన ఆరోపించారు.
Also Read
- Gujarat Man Suicide: భార్య, అత్తింటి వేధింపులు.. కొండపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య..
- Marco Rubio: భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోము.. నిరసనలపై మార్కో రూబియో..
- CJP: ‘‘జంతర్ మంతర్ ఎందుకు వెళ్లారు’’.. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు హైకోర్టు ఘాటు ప్రశ్నలు..
- CJP: ‘‘విద్యార్థుల నిరసనలు అల్లర్లుగా మారాయి’’.. ఫ్రాన్స్ ఘటనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తిరంగా పేరుతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఒక పథకం ప్రకారం ముందస్తు ప్రణాళికతో నడిపిస్తున్నారని ఆరోపించారు. జాతీయ జెండాను అడ్డుపెట్టుకుని అశాంతిని ప్రేరేపిస్తే చట్టపరమైన రక్షణ ఉండదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం బలహీనంగా ఉండే దేశాల్లో జరుగుతున్న తరహాలో భారత్‌లో అశాంతిని సృష్టించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
BJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ‘‘జెన్-జీ’’ కాదు.. తిరంగాతో సానుభూతి యత్నం!
-
Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
AP SEC: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు NOC, నో డ్యూ సర్టిఫికెట్లు అవసరం లేదు..!
-
Saudi Arabia: అప్పు చేసి సౌదీకి వెళ్లిన బంగ్లాదేశీ మహిళ.. చివరకు మరణశిక్ష!.
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..