Sam Pitroda: ‘‘అక్రమ బంగ్లాదేశీయుల్ని భారత్‌లోకి రానివ్వండి’’.. రాహుల్ గాంధీ సన్నిహితుడి వ్యాఖ్యలు..
- మరో వివాదంలోకి కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా..
- బంగ్లాదేశీయులను దేశంలోకి రానివ్వాలంటూ వ్యాఖ్యలు..
- ఢిల్లీ ఎన్నికల ముందు పిట్రోడా వివాదాస్పద కామెంట్స్..
- కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్న బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sam Pitroda: ఢిల్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ సన్నిహితుడు సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘బంగ్లాదేశీ అక్రమ వలసదారుల్ని’’ భారత్‌లోకి రానివ్వాలంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై బీజేపీ మండిపడుతోంది. గతంలో కూడా సామ్ పిట్రోడా చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్‌ని ఇరకాటంలో పెట్టాయి. లోక్‌సభ ఎన్నికల ముందు భారతీయులపై జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి దేశ ప్రజల ఆగ్రహానికి గురికావల్సి వచ్చింది.
Read Also: CM Revanth Reddy: ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి..
Also Read
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Bihar: బీహార్‌లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ఇదిలా ఉంటే ఆయన బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘వారు ఇక్కడికి రావాలనుకుంటే, చట్టవిరుద్ధమైనా వారిని రానివ్వండి. మనం అందరిని చేర్చుకోవాలి. మనం కొంచే బాధపడాల్సి వచ్చినా సరే. ఎవరూ పంచుకోవడానికి ఇష్టపడరు కానీ, మేము వనరుల్ని పంచుకుంటాము.’’ అని పిట్రోడా ఓ వీడియోలో చెప్పడం ఇప్పుడు వైరల్‌గా మారింది. అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న కేంద్రాన్ని ఆయన విమర్శించారు. బదులుగా అక్రమ బంగ్లాదేశీయులను వేధించడం కన్నా వాతావరణ మార్పు, ఇతర ప్రపంచ సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించాడు.
ఢిల్లీ ఎన్నికల ముందు ఈయన పిట్రోడా చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి సోషల్ మీడియాలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, పిట్రోడా ప్రకటనను “అతి దారుణమైనది” అని పేర్కొన్నారు. ‘‘రాహుల్ గాంధీ కుడిభుజం అయిన సామ్ పిట్రోడా దేశం మొత్తాన్ని నష్టపరిచినా కూడా బంగ్లాదేశీయలు భారత్‌లో స్థిరపడాలని వాదించడం దిగ్భ్రాంతికరమని, బాధ్యతారహితమైనవని అన్నారు. గత 70 ఏళ్లుగా మనదేశంలో అక్రమ వలసల్ని స్థిరపరచడానికి కాంగ్రెస్ ఓవర్ టైమ్ పనిచేసిందని విమర్శించారు.
OUTRAGEOUS!
Rahul Gandhi’s right hand man Sam Pitroda’s statement advocating for illegal migrants to settle in India, even at the country’s expense, is shocking and irresponsible.
Now you wonder how Congress since the last 70 years worked overtime to settle ILLEGALS in our… pic.twitter.com/kKVFusDD71
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) January 27, 2025
తాజావార్తలు
-
Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
-
Harish Rao : 22A భూములపై హరీశ్ రావు ఫైర్.. ‘కమీషన్ల కోసమే దోపిడీ!’
-
Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
-
Dhanush: “నాకు యాక్టింగ్ నేర్పిస్తావా?”.. ఇరుముడి పాపతో ధనుష్ వీడియో కాల్ వైరల్
-
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!