Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్.. ఈ ఏడాది అయ్యప్ప భక్తుల దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు. ఆలయ ప్రధాన పూజారులను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శన వేళలు వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయని అన్నారు. ఈ మార్పుల ద్వారా అయ్యప్ప భక్తులకు దర్శనం కోసం దాదాపు 17 గంటల సుదీర్ఘ సమయం పడుతుందని దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎస్.ప్రశాంత్ వెల్లడించారు.
Read Also: NTR : మరి గ్లోబల్ హీరో అంటే ఆ మాత్రం ఉండదా.. పిల్లల భవిష్యత్ అప్పుడే అలా ప్లాన్ చేసిన ఎన్టీఆర్
కాగా, ఈ ఏడాది శబరిమలలో అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు నవంబరు 15వ తేదీ నుంచి డిసెంబరు 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వచ్చే సంవత్సరం జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి వేళ శబరిమలలో మకర జ్యోతి (మకర విలక్కు) దర్శనమిస్తుంది. ఈసారి శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు ఆన్‌లైన్ బుకింగ్‌ను కేరళ సర్కార్ తప్పని సరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్పాట్ బుకింగ్ ఉండదని వెల్లడించింది. ఆన్ లైన్ బుకింగ్స్ చేసే వారికి 48 గంటల గ్రేస్ పీరియడ్‌ను అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించారు. ప్రతి రోజూ గరిష్టంగా దాదాపు 80 వేల మంది భక్తులను అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతించాలని ట్రావన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది.