NTR : మరి గ్లోబల్ హీరో అంటే ఆ మాత్రం ఉండదా.. పిల్లల భవిష్యత్ అప్పుడే అలా ప్లాన్ చేసిన ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR : గ్లోబల్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన ఎంత పెద్ద హీరో అయినా కూడా పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. సినిమా షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే, వీలైనంత ఎక్కువ సమయం తన కుటుంబంతో గడపడానికే చూస్తారు. గ్యాప్ దొరికినప్పుడల్లా భార్యా పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్స్ వేస్తుంటారు. సినీ ఈవెంట్లకు కూడా తీసుకొస్తుంటారు. అయితే సినిమా ఇంటర్వ్యూలలో తారక్ పెద్దగా తన ఫ్యామిలీ విషయాలను చెప్పడానికి ఇష్టపడరు. కానీ ఇటీవల పలు సందర్భాల్లో తన ఇద్దరు పిల్లల గురించి మాట్లాడారు. తన తండ్రి తనను ఎలా పెంచేవారో అలానే తన పిల్లలను కూడా పెంచుతున్నానంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల రిలీజై భారీ సక్సెస్ అందుకున్న ‘దేవర’ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ గురించి ఆసక్తికర విషయాలను వెళ్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వాళ్లిద్దరి ఆలోచనా విధానంలో చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. పిల్లలని సినీ ఇండస్ట్రీలో తీసుకువస్తారా? అని ప్రశ్నించగా.. నా అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను వారిపై రుద్దడం నచ్చదు. నేను అలా చేయను. ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు వారి సొంత ఆలోచనలు కలిగి ఉండారని నేను నమ్ముతాను. వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారో వారే నిర్ణయించుకునే వాతావరణాన్ని మాత్రం మనం కల్పించాలి. మనకి నచ్చింది చేయమని చెప్పడం కరెక్ట్ కాదు అని తారక్ అన్నారు.
“సినిమాల్లోకి రమ్మని, యాక్టింగ్ కెరీర్ ను ఎంచుకోమని నేను వాళ్లను బలవంతం చెయ్యను. ఎందుకంటే నా పేరెంట్స్ నన్ను ఆ విధంగా ట్రీట్ చేయలేదు. ఏదో సాధించాలనుకుంటున్నాడు.. చేయనివ్వు అనుకున్నారు. అదే విధంగా నేనూ నా పిల్లల అభిప్రాయాలను గౌరవించాలనుకుంటున్నాను. నా ప్రొఫెషన్ ఏంటనేది నా పిల్లలకు తెలుసు. తండ్రిని హీరోగా చూసినప్పుడు అదే దారిలో అడుగులు వేయాలని పిల్లలు కూడా అనుకుంటారు. ఇది సహజంగానే జరుగుతుంది” అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ఎన్టీఆర్ మాటలను బట్టి చూస్తే ఆయన కుమారులిద్దరూ తన తండ్రి మాదిరిగా సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే, RRR చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. తాజాగా ‘దేవర 1’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ దగ్గర రూ. 470 కోట్లకు పైగా రాబట్టింది. దీనికి కొనసాగింపుగా త్వరలో ‘దేవర 2’ రాబోతుంది. అంతకంటే ముందు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అలానే బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో నటిస్తున్నారు.
Read Also:India vs New Zealand: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఇదే..
Read Also:Suriya: వామ్మో సూర్య ఇదేం స్పీడు.. మరీ డిసెంబర్ నుంచేనా ?
- Tags
- #war2
- Abhayram
- Bhargavram
- Devara
- Devara2
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!