Russia: పాకిస్తాన్ తయారీ ఫైటర్ జెట్ JF-17 కోసం రష్యా ఇంజన్లు ఇస్తోందనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. మోడీ దౌత్య విధానం విఫలమైందని ఆరోపించింది. అయితే, ఈ ఊహాగానాలను రష్యా ఖండించింది. నిజానికి, JF-17 యుద్ధ విమానం కోసం పాకిస్తాన్‌కు RD-93 ఇంజిన్‌లను సరఫరా చేయడం వల్ల వాస్తవానికి భారతదేశానికి ప్రయోజనం చేకూరుతుందని రష్యన్ రక్షణ నిపుణులు చెబుతున్నారు.
‘‘భారత్‌లో ప్రతిపక్ష విమర్శలు సమర్థనీయమని నేను అనుకోను. JF-17 కోసం రష్యా ఇంజిన్‌లను అందిస్తున్నట్లు వచ్చిన నివేదికలు సరైనవే అయితే, అది వాస్తవానికి భారతదేశానికి రెండు విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది” అని మాస్కోలోని ప్రిమాకోవ్ ఇన్‌స్టిట్యూట్‌లో దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో సవాళ్ల విభాగానికి అధిపతిగా ఉన్న ప్యోటర్ టోపిచ్కనోవ్ అన్నారు.
Read Also: 11 Nations Warn Trump: అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చిన 11 దేశాలు!
‘‘దీని వల్ల ముందుగా చైనా, పాకిస్తాన్‌లు రష్యన్ ఇంజన్లను భర్తీ చేయలేకపోవడాన్ని చూపిస్తుంది, రెండోది కొత్త విమానం ఎలా పనిచేస్తుందనే విషయం భారత్‌కు సుపరిచితం, దాని పనితీరును భారత్ ఊహించగలదు. ఇదే తరహా ఇంజన్లు పనితీరు భారత్ గతంలో పరిశీలించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ JF-17 యుద్ధవిమానాల వినియోగాన్ని భారత్ దగ్గరుండి గమనించింది. అందువల్ల ఈ విమానాల లక్షణాలు, పనితీరు, పరిమితులు భారత్‌కు ఇప్పటికీ బాగా తెలుసు. ఈ కారణంగా చైనా, పాకిస్తాన్ ఈ విమానాలతో భారత్‌ను ఆశ్చర్యానికి గురిచేయలేవు’’ అని ఆయన వివరించారు.
పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక రష్యా నిపుణుడు మాట్లాడుతూ.. RD-93 ఒప్పందం సాంకేతిక బదిలీ లేకుండా పూర్తిగా వాణిజ్యపరమైనదని రష్యా, భారత్‌కు హామీ ఇచ్చిందని. భారత్ ఇప్పటికే టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ కింద ఉన్నతమైన RD-33 ఇంజిన్‌ల కోసం లైసెన్స్‌ను పొందిందని పేర్కొన్నారు. క్లిమోవ్ ఉత్పత్తి చేసిన D-93 ఇంజిన్లు, ఎక్కువ థ్రస్ట్‌ను అందిస్తాయి, వీటిని సర్వీస్ టైమ్ కేవలం 2200 గంటలే. ఇక RD-33 ఏకంగా 4,000 గంటల సర్వీస్ లైఫ్‌ని కలిగి ఉంటుంది. రష్యా-చైనా-పాకిస్తాన్ ఒప్పందం ప్రకారం, రష్యా 2000ల నుంచి పూర్తిగా అసెంబుల్ చేసిన RD-93 ఇంజిన్‌లను సరఫరా చేస్తోంది. పాకిస్తాన్ ఇప్పుడు సవరించిన వెర్షన్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది, అది ఇంకా సిద్ధంగా లేదు.
