Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక ప్రసంగం
- ప్రవర్తనతో ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- భారతీయ కుటుంబాలుకు పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ కుటుంబాలు, ప్రతి వ్యక్తి తమ ప్రవర్తన ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు. భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలంటే ప్రవర్తన కావాలని.. అప్పుడే భారత్ తన విశ్వమానవ ధ్యేయాన్ని విజయవంతంగా నెరవేర్చగలదని పేర్కొన్నారు.
స్వయంసేవకుల జీవిత లక్ష్యం, దేశ సేవ, భారత భవిష్యత్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృభూమి సేవకు స్వచ్ఛందంగా అంకితమై నిరంతరం నిజమైన స్వయంసేవకులుగా మారేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘‘మాతృభూమికి సేవ చేయాలనే సంకల్పాన్ని మనం స్వచ్ఛందంగా స్వీకరించాం. నిజమైన స్వయంసేవకులుగా ఎదగడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాం. ఒక స్వయంసేవకుడు సాధించగల పరిపూర్ణతకు ఎలాంటి హద్దులు లేవు. ఆ పరిపూర్ణత శిఖరాన్ని డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్ జీవితంలో మనం చూశాం.’’ అని తెలిపారు. ఆ పరిపూర్ణత సాధించాలంటే నిరంతర సాధన అవసరమని పేర్కొన్నారు. సౌకర్యాలతో అలాంటి సాధన సాధ్యం కాదని.. క్రమశిక్షణ, త్యాగం, నిరంతర కృషి ద్వారానే నిజమైన స్వయంసేవకుడిగా ఎదగవచ్చని వివరించారు.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ప్రపంచానికి భారత్ ప్రత్యేకమైన సందేశాన్ని అందించే బాధ్యత కలిగిన దేశమని మోహన్ భగవత్ అన్నారు. ‘‘భారత్ తన ప్రపంచ ధ్యేయాన్ని నెరవేర్చాలంటే.. ముందుగా ఆ ఆదర్శాన్ని తన జీవితంలో ఆచరణలో చూపించే దేశంగా మారాలి. ప్రపంచానికి ఏ జీవన విధానాన్ని చూపించాలనుకుంటుందో, అదే విధానాన్ని భారతీయులు తమ కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఆచరించాలి.’’ అని సూచించారు.
దేశ విదేశాల నుంచి వచ్చే ప్రజలు సంఘ్ పనితీరును పరిశీలించి ప్రశంసిస్తున్నారని.. తమ దేశ యువతకు కూడా ఇలాంటి శిక్షణ అందించాలని కోరుతున్నారని తెలిపారు. ‘‘దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అనేక మంది సంఘ్‌ను పరిశీలించడానికి వస్తున్నారు. ఐదు ఖండాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకే విషయం చెబుతున్నారు. మీరు సంఘ్‌లో యువతకు ఇస్తున్న శిక్షణ మాకు కూడా ఇవ్వండి. మా దేశాల్లోని యువతకు కూడా అలాంటి శిక్షణ అందించేందుకు మమ్మల్ని సిద్ధం చేయండి అని కోరుతున్నారు.’’ అని వెల్లడించారు.
అయితే సంఘ్ ప్రయాణం ఇంకా కొనసాగుతోందని.. ముందున్న లక్ష్యాలు చాలా పెద్దవని అన్నారు. ‘‘వ్యక్తిత్వ నిర్మాణానికి ఆదర్శంగా నిలవడం దగ్గరే సంఘ్ పని ఆగిపోదు. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. మన ప్రయాణం ఇంకా కొనసాగుతోంది.’’ అని పేర్కొన్నారు. ప్రపంచం ఇప్పటికీ భారతదేశం మానవాళికి దారి చూపగల దేశమని విశ్వసిస్తోందని మోహన్ భగవత్ చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా అనేక రచనలు, ప్రసంగాల్లో కూడా భారత్ ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తుందని, మానవాళి ఆ మార్గాన్నే అనుసరించాలని పేర్కొంటున్నారు. అయితే అది జరగాలంటే ముందుగా భారత్ తన మూల విలువల ఆధారంగా అత్యున్నత వైభవం, అత్యున్నత శక్తిని సాధించిన దేశంగా ఎదగాలి.’’ అని వ్యాఖ్యానించారు. భారత్ బలమైన, ఆదర్శవంతమైన దేశంగా అభివృద్ధి చెందినప్పుడే ప్రపంచానికి నిజమైన నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంటుందని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ఆయోధ్య రామమందిర విరాళాల స్కామ్‌పై తొలిసారి ఆర్ఎస్ఎస్ స్పందించింది. ఈ ఘటనతో రామభక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రకటనలో తెలిపింది. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఆర్ఎస్ఎస్ తరపున సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే ఈ ప్రకటనను విడుదల చేశారు.
#WATCH | Nagpur, Maharashtra: RSS chief Mohan Bhagwat says, "We have taken a vow to serve the Motherland, driven by self-inspiration, and we constantly strive to become true Swayamsevaks. There is no limit to the perfection a Swayamsevak can attain; we witnessed its pinnacle in… pic.twitter.com/0YNYj5enHt
— ANI (@ANI) July 3, 2026
#WATCH | Nagpur, Maharashtra: RSS chief Mohan Bhagwat says, "People from both within the country and abroad come, observe the Sangh, and all of them say the same thing. People from all five continents have visited, and everyone has expressed this sentiment. Whoever comes asks,… pic.twitter.com/ERm5ya0Pnc
— ANI (@ANI) July 3, 2026
- Tags
- Mohan Bhagwat
- Nagpur
- RSS Chief
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!