Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్‌లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- కోడి కోసం కొట్టుకున్న యువకులు..
- తమిళనాడు తిరుపత్తూరు జిల్లా వాణియంబడిలో ఘటన..
- రూ.25 వేల విలువైన పందెంకోడిని దొంగలించి తిన్న యువకులు..
- కోడి కనిపించడం లేదంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు పెట్టి ఆరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు తిరుపత్తూరు జిల్లా వాణియంబడిలో పందెంకోడి కోసం యువకుల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. రూ.25 వేల విలువైన కోడిని దొంగలించి చికెన్ షాపులో క్లీన్ చేసి తిన్నారనే ఆరోపణలతో మొదలైన వివాదం చివరకు దాడికి దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జాఫ్రాబాద్‌కు చెందిన ఖాదర్ పందెంకోళ్లను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి వద్ద ఉన్న సుమారు రూ.25 వేల విలువైన పందెంకోడి బుధవారం కనిపించకుండా పోయింది. కోడి కోసం పరిసర ప్రాంతాల్లో ఆరా తీసిన ఖాదర్.. దాని ఫొటోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసి, ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరాడు.
ఈ క్రమంలో పల్లెపట్టు ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు ఆ కోడిని తీసుకెళ్లి చికెన్ షాపులో క్లీన్ చేసి తిన్నట్లు ఖాదర్‌కు సమాచారం అందింది. దీంతో సంబంధిత యువకులను ఖాదర్ ప్రశ్నించాడు. ఈ విషయం యువకుల మధ్య వివాదానికి దారితీసింది. తమపైనే ఆరోపణలు చేస్తావా అంటూ ఆగ్రహించిన యువకులు చికెన్ షాపుకు చెందిన ముగ్గురిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ దాడిలో ముగ్గురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, నడిరోడ్డుపై యువకుల మధ్య ఘర్షణ జరగడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, గొడవకు దారితీసిన కారణాలు, కోడిని ఎవరు తీసుకెళ్లారు, దాడికి పాల్పడిన వారెవరనే అంశాలపై విచారణ చేపట్టారు.
Also Read
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
తాజావార్తలు
-
TOXIC : టాక్సిక్ టాక్ ఏంటి.. డే-1 ఈ కలెక్షన్స్ ఏంటి?
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఉగ్ర దేశ జాబితా నుంచి ఆ దేశం తొలగింపు
-
Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్‌లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
-
Nepal Floods: నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!