మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్గానాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వే పై ఐరన్‌లోడ్ తో వెళ్తున్నలారీ బోల్తా పడింది. ఆ ఘటనలో 13 మంది మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. టిప్పర్ లారీపై 16 మంది కూలీలు ఐరల్‌లోడ్‌పై కూర్చోని ప్రయాణం చేస్తున్నారు. సడన్‌గా ఎక్స్‌ప్రెస్ వే పై అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతం మొత్తం హృదయవిదారకంగా మారిపోయింది.