RN Ravi: ఎన్నికల వేళ కీలక పరిణామం.. బెంగాల్ గవర్నర్‌గా ఆర్ఎన్.రవి ప్రమాణస్వీకారం
- బెంగాల్ గవర్నర్‌గా ఆర్ఎన్.రవి ప్రమాణస్వీకారం
- కోల్‌కతా రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం
- హాజరైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన ఆర్ఎన్ రవి.. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం 11:30 గంటలకు కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో ఆర్ఎన్.రవి ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తి, అసెంబ్లీ స్పీకర్ బిమాన్ బెనర్జీ, లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమాన్ బసు తదితరులు హాజరయ్యారు.

Also Read
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ తమిళనాడు గవర్నర్‌గా పని చేసిన రవి.. బెంగాల్‌కు పంపించడం పొలిటికల్‌గా ఆసక్తి రేపుతోంది. నిన్నామొన్నటిదాకా తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ సర్కార్‌తో నిత్యం గవర్నర్ రవి మధ్య విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించకుండా అర్ధాంతరంగా వెళ్లిపోయారు. త్వరలో బెంగాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో రవిని బెంగాల్‌కు పంపించడం పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Trump: ప్రపంచ దేశాలపై ట్రంప్ మరో అస్త్రం.. లిస్ట్‌లో భారత్, చైనా?
బెంగాల్ గవర్నర్‌గా ఉన్న సీవీ ఆనంద్ బోస్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో రవికి పశ్చిమ బెంగాల్ శాశ్వత గవర్నర్ బాధ్యతలు అప్పగించారు. చాలా కాలం తమిళనాడు గవర్నర్‌గా ఉన్నారు. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న కాలంలో రవి పదేపదే డీఎంకె ప్రభుత్వంతో ఘర్షణ పడుతూనే ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ బిల్లులపై స్టాలిన్ ప్రభుత్వంతో వివాదం నడిచింది. గవర్నర్‌ను తొలగించాలని స్టాలిన్ సర్కార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా పిటిషన్ వేసింది. అనూహ్యంగా రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పంపించింది.
ఇది కూడా చదవండి: Iran: యుద్ధం ముగింపునకు ఇరాన్ 3 షరతులు.. రెస్పాన్స్ ఎలా ఉంటుందో..!?
ఇదిలా ఉంటే సీవీ ఆనంద్ బోస్ గవర్నర్ పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేయడాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. తమిళనాడు గవర్నర్ రవి పేరును తదుపరి గవర్నర్‌గా ప్రకటించిన వెంటనే మమత సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ ఆకస్మిక రాజీనామా వార్తతో నేను షాక్ అయ్యాను. తీవ్ర ఆందోళన చెందాను. ప్రస్తుతానికి రాజీనామాకు కారణం నాకు తెలియదు. అయితే ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి గవర్నర్ కేంద్ర హోంమంత్రి నుంచి ఒత్తిడిలో ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోను.’’ అని రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Trump: మా డిమాండ్లు అంగీకరించకపోతే మోజ్తాబాను చంపేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్!
#WATCH | West Bengal Chief Minister Mamata Banerjee felicitated newly appointed West Bengal Governor RN Ravi during his oath-taking ceremony in Kolkata earlier today. pic.twitter.com/xbr7xnyVqw
— ANI (@ANI) March 12, 2026
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..