Rishabh Pant: రిషభ్ పంత్ ఆరోగ్యంపై అప్డేట్.. వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant Health Condition: నిన్న రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అతని ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రిషభ్‌కు డెహ్రాడూన్ మ్యాక్స్ ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతోంది. మెదడు లేదా వెన్నుకు ఎటువంటి గాయాలు కాలేదని వైద్యులు తెలిపారు. ఈరోజు అతనికి మరోసారి ఎమ్ఆర్ఐ సహా పలు పరీక్షలు జరపనున్నారు. అటు ప్రధాని మోడీ నిన్న రాత్రి రిషబ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. రిషబ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బీసీసీఐ సైతం రిషబ్ ఆరోగ్య పరిస్థితిపై అతని కుటుంబం, వైద్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.
కాగా.. శుక్రవారం రాత్రి ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వస్తున్న సమయంలో రిషభ్ పంత్ కారు అదుపు తప్పి రోడ్డుపై డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రిషభ్ కారు ధ్వంసం అవ్వగా.. రిషబ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అతని నుదిటిపై, మోకాలికి, వీపుపై, కుడి మణికట్టు, బొటనవేలుకి గాయాలయ్యాయి. నిద్రమత్తులో కారు నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పంత్ ఒక్కడే కారులో ఉన్నాడని, కారు అద్దాలను పగలగొట్టుకొని బయటకు వచ్చాడు. దురదృష్టం ఏమిటంటే.. ప్రమాదం జరిగిన తర్వాత రిషభ్‌కి సహాయం చేస్తున్నట్టు నటిస్తూ, కొందరు దుండగులు అతడ్ని దోపిడీ చేశారు.
Also Read
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
మరోవైపు, రిషభ్ పంత్ యాక్సిడెంట్ గురించి సుశీల్ అనే బస్సు డ్రైవర్ మాట్లాడుతూ.. ‘‘పంత్ కారు డివైడర్‌ను ఢీకొని దాదాపు 200 మీటర్లు దూసుకెళ్లింది. వెంటనే నా బస్సును రోడ్డు పక్కన ఆపేసి, ప్రమాదం జరిగిన కారు వద్దకు వెళ్లాను. పంత్ అప్పటికే కారు విండో నుంచి సగం బయటకు వచ్చాడు. తానొక క్రికెటర్‌నని, తన తల్లికి ఫోన్ చేయమని పంత్ కోరాడు. నేను క్రికెట్ చూడను కాబట్టి పంత్‌ని గుర్తుపట్టలేకపోయాను. అతడిని వెంటనే బయటకు లాగి.. కారులో ఇంకెవరైనా ఉన్నారేమో చూశాను. అతడి నీలం రంగు బ్యాగ్, రూ.7,000 నగదును గుర్తించి, వాటిని అంబులెన్స్‌లో అతడికి అప్పగించాం’’ అని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!