Republic Day 2023: 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు యావత్ భారతదేశం సిద్ధమైంది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26, 1950 నుండి దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ రోజున భారత త్రివిధ దళాలు కవాతు నిర్వహిస్తాయి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్‌పథ్, ఇండియా గేట్ మీదుగా ఎర్రకోట వరకు కవాతు కొనసాగుతుంది. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా భారీ కవాతు నిర్వహించనున్నాయి. ఈ కవాతును చూసేందుకు లక్షలాది మంది అక్కడికి తరలివస్తారు.
ఫిబ్రవరి 6 నుండి ప్రతీ గడప వెళతామన్నారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ స్ఫూర్తి తో హాత్ సే హాత్ జొడో యాత్ర ప్రారంభం కానుందని..నిరంతరం పాదయాత్ర లో పాల్గొంటామన్నారు. పార్టీ ఆదేశించినట్టు పాదయాత్ర కొనసాగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. హాజరైన ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్.. సీఎం మధ్య విభేదాలు ఉంటే వేరే వేదిక మీద చూసుకోవాలని, కానీ గణతంత్ర దినోత్సవం విషయంలో గొడవ సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే గవర్నర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గత ఏడాది కోర్ట్ లలో 592 ఖాళీలు భర్తీ చేశామన్నారు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్. ఈ ఏడాది జనవరి 1 నే రిక్రూట్ మెంట్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. లోకదాలత్ ద్వారా 16 లక్షల కేసులు పరిష్కారించామన్నారు. కోర్ట్ ల ద్వారా బాధితులకు 52.5 కోట్ల పరిహారం..మీడియేషన్ ద్వారా 1608 కేసులు పరిష్కారమన్నారు. పెండింగ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయని, లైవ్ స్ట్రీమింగ్ ను మిగతా కోర్ట్ లకు విస్తరించే ప్రయత్నం చేస్తామన్నారు.
జాతీయ జెండాను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆవిష్కరించారు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ పబ్లిక్ ప్రైవేట్ జీవితాల్లో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రతి పౌరుడికి న్యాయం చేకూరేలా జుడిషియారీ పని చేస్తుందన్నారు. న్యాయవాదుల అభివృద్ధికి హైకోర్టు కట్టుబడి ఉందన్నారు. న్యాయవాదులకు హై కోర్ట్ లో పార్కింగ్ సమస్య ఉందనీ తెలుసు.. న్యాయవాదుల సమస్యలను హై కోర్టు పరిష్కరిస్తుందని తెలిపారు.
త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గణతంత్ర వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా ఇండియాకు వచ్చిన ఈజిఫ్టు అధ్యక్షుడు అబ్దుల్లా ఫతేహ్ అల్ సిసితో కలిసి రిపబ్లిక్ వేడకల్లో పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ పమేలా సత్పతి, సూర్యాపేట కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్. నిజమాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన కలెక్టర్ గౌతమ్.
సర్వోన్నత న్యాయ స్థానం పరేడ్ గ్రౌండ్ లో జెండా వేడుకలు నిర్వహించాలనే మాటను సీఎం తుంగలో తొక్కారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో గవర్నర్ తో జెండా వేడుకలు జరపవద్దనే జిల్లాల్లో రద్దు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో ఇంతగా రాజకీయాలను దిగజార్చడం బాధాకరం.. ఈ అవమానం జాతీయ జెండాకు చేసినట్టే అన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చి ఖమ్మంలో బహిరంగ సభ పెడితే కరోనా పాండమిక్ ఉండదా?రేపు మీ పుట్టిన రోజు సందర్భంగా సచివాలయం ప్రారంభిస్తామనుకుంటే కరోనా రాదా?
74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగానికి భిన్నంగా సిఎం కెసిఆర్ పరిపాలన చేయడం బాధాకరమన్నారు. గవర్నర్ ను, బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్నామనుకునే మీ నిర్ణయాల వల్ల జాతీయ జెండాను అవమానం జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రగతి భవన్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ లో జాతీయ జెండా ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు నివాళులర్పించిన సీఎం. జెండా ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు.
ఢిల్లీలోని కర్తవ్యమార్గ్ లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మొదలయ్యాయి. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులైన సైనికులుకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ప్రధాని మోదీతో పాటు కేంద్రం రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర సైనికాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతీయ జెండా ఆవిష్కరంచారు బీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కేకే, గణతంత్ర వేడుకల్లో హోంమంత్రి మహబూబ్ అలీ, బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.
పరేడ్ గ్రౌండ్ కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. పరేడ్ గ్రౌండ్ లో అమర జవాన్ల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళలర్పించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. జాతీయ జెండాను ఎగుర వేసిన రాష్ట్ర అధ్యక్షుండు బండి సంజయ్. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.. అసెంబ్లీ ప్రాంగణంలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.. శాసన మండలి దగ్గర జాతీయ జెండాను ఆవిష్కరించారు మండలి ఛైర్మన్ మోషేన్ రాజు
సచివాలయంలో రిపబ్లిక్ డే దినోత్సవం వేడుకలు నిర్వహించారు.. జాతీయ జెండా ఆవిష్కరించారు సీఎస్ జవహర్ రెడ్డి.. సచివాలయం బ్లాక్ వన్ దగ్గర వేడుకల్లో పాల్గొన్న పలువురు అధికారులు
విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లు పాల్గొన్నారు.
ఎం.ఎం. కీరవాణి, చంద్రబోస్‌ను గవర్నర్ సన్మానించారు. బాలలత, ఆకుల శ్రీజను సన్మానించారు గవర్నర్. పద్మశ్రీ అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు కీరవాణి. భగవంతుని ఆశీర్వాదం, ప్రజల అభిమానంతోనే పద్మశ్రీ వచ్చిందని తెలిపారు కీరవాణి.
తెలంగాణ లో ఆందోళన కర పరిస్థితులు ఉన్నాయన్నారు గవర్నర్ తమిళిసై. రాష్ట్రంలో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. కొందరికి ఫార్మ్ హౌస్ లు కాదు అందరికీ ఫార్మ్ లు కావాలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కును కాపాడుకుందామన్నారు.
తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు గవర్నర్ తమిళిసై. తెలంగాణ ప్రజలు ఆత్మస్థైర్యంతో ఉండాలన్నారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామన్నారు గవర్నర్ తమిళిసై.
రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందన్నారు గవర్నర్ తమిళిసై. తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందన్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు.
తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళిసై. తెలంగాణకు ఘనమైన విశిష్టమైన చరిత్ర ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదన్నారు. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించారన్నారు.
దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్ తో కనెక్టవిటీ ఉందని అన్నారు గవర్నర్ తమిళిసై. ఇటీవలే సికింద్రాబాద్ కు ప్రధాని వందేభారత్ రైలు కేటాయించారన్నారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్ అందిస్తోందన్నారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదా, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామన్నారు.
తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర తప్పక ఉంటుందన్నారు గవర్నర్. రాజ్‌భవన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో రాజ్‌భవన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రాష్ర్టాభివృధ్దికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్ అందిస్తోందన్నారు గవర్నర్.
కొత్తభవనాలు నిర్మించినంత మాత్రాన అభివృద్ధి కాదన్నారు గవర్నర్. తెలంగాణలో రోజు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలు ఆత్మస్థైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదా.
కొందరికి నేను నచ్చకపోవచ్చు కానీ తెలంగాణ ప్రజలంటే నాకు చాలా ఇష్టం. వారికోసం నేను కష్టపడుతాను. నా తెలంగాణ కోటి రత్నాల వీణ. జై తెలంగాణ జై తెలంగాణ అంటూ సమావేశం ముగించారు గవర్నర్ తమిళిసై.
అమర జవాన్ల స్థూపం వద్ద గవర్నర్ నివాళులర్పించారు. అనంతరం రాజ్ భవన్ కు బయలు దేరారు. కోర్ట్ ఉత్తర్వుల నేపథ్యం లో రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాజ్ భవన్ చేరుకున్న గవర్నర్ తమిళిసై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గవర్నర్ తమిళిసై జాతీయ జండా ఎగురవేశారు.