క్విట్ ఇండియా ఉద్యమానికి 79 ఏళ్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1920 నుంచి భారత స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించిన వారిలో గాంధీ మహాత్ముడు ముందువరసలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అహింసా మార్గంలో ఆయన పోరాటం చేశారు. సత్యాగ్రహ దీక్షతో ఆకట్టుకున్నారు. దండి మార్చ్, విదేశీ దుస్తుల బహిష్కరణ వంటి కీలక పోరాటాలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యాక ఇండియాలో స్వాంతంత్ర పోరాటం మరింత ఉధృతం అయింతి. ఇండియాకు స్వాతంత్రం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ బ్రిటీష్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటుగా, రెండో ప్రపంచ యుద్ధం పూర్తయ్యాక చూద్దాంలే అని చెప్పడంటో క్విట్ ఇండియా ఉద్యమం రూపుదాల్చింది.
Read: వివాదంలో మణిరత్నం “నవరస”
Also Read
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్‌ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్‌లలో చెలరేగిన మంటలు
1942, ఆగస్టు 8 వ తేదీన బాంబేలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మహాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. క్రిప్స్ మిషన్ విఫలమైన తరువాత మహాత్మగాంధీ ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం సభలో డూ ఆర్ డై కి పిలుపునిచ్చారు. ఒకవైపు యుద్ధం, మరోవైపు ఇండియాలో స్వాతంత్రం కోసం పోరాటం తీవ్రం కావడంతో బ్రిటీష్ పాలకులు దేశంలోని వేలాది మంది నేతలను ఆరెస్టులు చేసి జైల్లో ఉంచారు. యుద్ధం పూర్తయ్యేవరకు వారిని జైలు నుంచి విడుదల చేయలేదు. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు స్వచ్చందంగా రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలిపారు. ఆ సమయంలో కొన్ని చోట్ల చిన్న తరహా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బ్రిటీష్ పాలకులపై ఒత్తిడి తీసుకురావడంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. కాగా, క్విట్ ఇండియా ఉద్యమానికి నేటిలో 79 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా క్విట్ ఇండియా ఉద్యమం గురించిన ఎగ్జిబిషన్‌ను ఢిల్లీలో ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..