Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Rekha Arya Files FIR Against Husband: ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి రేఖా ఆర్య తన భర్త గిర్ధారి లాల్ సాహుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.. ఈ వ్యవహారంపై ఆమె ఎఫ్ఐఆర్ నమోదు చేయించడంతో పాటు, తన వాదనలను వివరిస్తూ కన్నీళ్లతో కూడిన వీడియోను కూడా విడుదల చేశారు.
భర్తపై తీవ్ర ఆరోపణలు
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం, తమ వివాహ సమయంలో తన భర్త గత వివాహం గురించి తనకు తెలియకుండా దాచిపెట్టారని రేఖా ఆర్య ఆరోపించారు. ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నారని, తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.. అంతేకాకుండా, తనను చంపేస్తానని బెదిరించడంతో పాటు కులపరమైన దూషణలకు పాల్పడ్డారని కూడా ఆరోపించారు.
Also Read
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
- PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
ఆడియో రికార్డింగ్తో ఆందోళన
ఈ వివాదంలో ఒక ఆడియో రికార్డింగ్ కీలకంగా మారిందని రేఖా ఆర్య పేర్కొన్నారు.. తనను, తన పిల్లలను లక్ష్యంగా చేసుకుని కుట్ర పన్నినట్లు ఆ రికార్డింగ్ ద్వారా తెలిసిందని ఆమె ఆరోపించారు.. ఆడియో విన్న తర్వాత తన కుటుంబ భద్రతపై ఆందోళన పెరిగిందని, అందుకే పోలీసులను ఆశ్రయించినట్టు పేర్కొన్నారు..
సంతకం ఫోర్జరీ చేశారన్న ఆరోపణ
తనను ఒక కంపెనీ డైరెక్టర్ పదవి నుంచి తొలగించేందుకు భర్త తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని కూడా రేఖా ఆర్య ఆరోపించారు. ఈ వ్యవహారంలో తనకు అన్యాయం జరిగిందని ఆమె చెబుతున్నారు.. ఈ ఆరోపణలు వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదంతో పాటు, కంపెనీ వ్యవహారాలపైనా ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
మహిళలకు రేఖా ఆర్య విజ్ఞప్తి
తన ఆరోపణలపై వివరణ ఇస్తూ రేఖా ఆర్య విడుదల చేసిన వీడియోలో భావోద్వేగానికి గురయ్యారు.. తనకు, తన పిల్లలకు భద్రత కల్పించుకోవాలనే ఉద్దేశంతోనే పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు.. గృహ హింస, వేధింపులను మహిళలు మౌనంగా భరించవద్దని, అవసరమైనప్పుడు తమ సమస్యలను బయటపెట్టి న్యాయ సహాయం తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.. భయం లేదా ఒత్తిడి కారణంగా మహిళలు అన్యాయాన్ని సహించాల్సిన అవసరం లేదని, తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రేఖా ఆర్య సూచించారు..
తాజావార్తలు
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
-
Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!