NTV Telugu Site icon

India vs Pakistan: పాకిస్తాన్ హమాస్‌కి మద్దతు తెలుపకుండా ఇండియా గెలిచింది.. క్రికెట్ మ్యాచ్‌పై ఇజ్రాయిల్ రాయబారి కీలక వ్యాఖ్యలు..

Israel Envoy

Israel Envoy

India vs Pakistan: వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. శనివారం జరిగిన ఈ మ్యాచులో పాకిస్తాన్ ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఏ దశలోనూ భారత్ జట్టుకు పోటీగా నిలబడలేదు. ఐసీసీ ఈవెంట్లలో మరోసారి భారత్ చేతిలో 8వసారి ఓడిపోయింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచులో ఓ అభిమాని ఇజ్రాయిల్ కి మద్దతుగా పోస్టర్లను ప్రదర్శించారు. భారత ప్రధాని మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ఉన్న ఫోటోలు కలిగిన పోస్టర్లను సదరు వ్యక్తి ప్రదర్శించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలను భారత్ లోని ఇజ్రాయిల్ రాయబారి నౌర్ గిలోన్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ దృశ్యం నన్ను కదిలించిందని కామెంట్ చేశారు.

Read Also: Nitish Kumar: నితీష్ కుమార్ ‘రెండో గాంధీ’.. బీహార్‌లో కొత్త వివాదం..

హమాస్‌కు పాకిస్తాన్ మద్దతు తెలిపకుండా భారత్ విజయం అడ్డుకుందని అందుకు నేను సంతోషిస్తున్నానని గిలోన్ అన్నారు. మ్యాచ్ సమయంలో భారత స్నేహితులు ఇజ్రాయిల్ కి తమ సంఘీభావం ప్రకటించడం మమ్మల్ని కదిలించింది, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యుద్దం చేస్తున్న ఇజ్రాయిల్ కి భారత్ మద్దతుగా నిలుస్తోంది అని ఓ అభిమాని పోస్టర్లు పట్టుకున్న ఫోటోలను గిలోన్ పోస్ట్ చేశారు. అంతకుముంద శ్రీలంకతో జరిగిన మ్యాచులో పాకిస్తాన్ బ్యాటర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును హమాస్ లోని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ఈ దృశ్యం వైరల్ అయింది.

ఇజ్రాయిల్-హమాస్ పోరులో ఇజ్రాయిల్ కి భారత్ మద్దతు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఇజ్రాయిల్ కి అండగా ఉంటామని ప్రకటించారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో మాట్లాడుతూ, మేము ఉన్నామంటూ భరోసా ఇచ్చారు. దీనిపై రాయబారి గిలోన్ మాట్లాడుతూ.. చాలా మంది భారతీయులు ఇజ్రాయిల్ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, దీంతో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ మరో విభాగాన్ని ఏర్పాటు చేయమని అభివర్ణించారు. ఉగ్రవాద చర్యలను మొదట ఖండించిన ప్రపంచ నేతల్లో ప్రధాని మోడీ ఒకరని ప్రశంసించారు.