అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతం అవుతూనే ఉంటాయి.. గతంలో ఎన్నో పరిణామాలు, ఎన్నో అద్భుతాలు జరిగాయి.. ఖగోళంలో జరిగే అద్భుతాలను ముందే అంచనా వేయడంతో పాటు.. అంతరిక్షంలో ఆవిష్కృతం అయిన అద్భుతాలను బంధించి ప్రజలకు చూపిస్తున్నారు.. ఫలానా రోజు, ఫలానా సమయానికి ఈ అద్భుతం జరగబోతోంది అంటూ ముందే అంచనా వేయడమే కాదు.. వాటిని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఇక, అసలు విషయానికి వస్తే.. దాదాపు వెయ్యి ఏళ్ల తర్వాత ఖగోళం ఓ అద్భుతం జరిగింది.. ఒకే రేఖపై 4 గ్రహాలు దర్శనమిచ్చాయి. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతితో పాటు శని గ్రహాలు ఒకే రేఖపైకి చేరి అద్భుతాన్ని సృష్టించాయి.. సూర్యోదయానికి ముందు ఈ గ్రహాలు ఒకే రేఖపైన దర్శనమిచ్చినట్లు భువనేశ్వర్‌లోని పఠాని సమంత ప్లానిటోరియం ప్రకటించింది.
Read Also: Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
ఈ నెల 26, 27 తేదీల్లో ఈ అరుదైన గ్రహాల కూర్పు కనిపించిందని వెల్లడించారు పఠాని సమంత ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్సువేందు పట్నాయక్, దీనిని ప్లానెట్పరేడ్గా చెబుతున్నారు.. అంతరిక్షంలో సాధారణంగా మూడు ప్లానెట్పరేడ్లు కనిపిస్తాయని తెలిపారు సువేందు పట్నాయక్. అందులో మొదటిది.. సూర్యుడికి ఒకవైపునకు గ్రహాలు ఒకే వరుసలో కనిపిస్తాయి. మూడు గ్రహాలు సూర్యుడికి ఒకవైపునకు కనిపించటం సర్వసాధారణం.. ఇలా ఏడాదిలో చాలా సార్లు కనిపిస్తుంటాయి.. అలాగే.. ఏడాదిలో ఒకసారి నాలుగు గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. 19 ఏళ్లకోసారి ఐదు గ్రహాలు, 170 ఏళ్లకోసారి 8 గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయని వెల్లడించారు.. అయితే, 26, 27 తేదీల్లో సూర్యోదయానికి ఒక గంట ముందు, చంద్రుడితో పాటు నాలుగు గ్రహాలు తూర్పు అక్షాంక్షానికి 30 డిగ్రీల కోణంలో ఒకే వరుసలో కనిపించాయని.. గతంలో సుమారు వెయ్యి ఏళ్ల క్రితం అంటే.. క్రీస్తు శకం 947లో ఇలా జరిగిందని చెబుతున్నారు..