దేశంలో సెప్టెంబర్ 22 నుండి GST కొత్త సవరణలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను సవరిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS కూడా తన స్కూటర్లు, బైకుల ధరలను తగ్గించింది. కంపెనీ 10 స్కూటర్లు, మోటార్ సైకిళ్ల ధరలను తగ్గించారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఎంట్రీ లెవల్ స్కూటర్ల నుండి మోటార్ సైకిళ్ల వరకు వివిధ రకాల స్కూటర్ల ధరలు తగ్గించారు. టీవీఎస్ వివిధ స్కూటర్లు,…
Europa Clipper Probe: సౌరకుటుంబంలో గ్రహాలకు పెద్దన్న బృహస్పతి(గురుడి) వద్దకు నాసాకు చెందిన ‘‘యూరోపా క్లిప్పర్ ప్రోబ్’’ ప్రయాణం మొదలైంది. సోమవారం ఫ్లోరిడా నుంచి అంతరిక్ష నౌక బయలుదేరింది. 2.9 బిలియన్ కిలోమీటర్ల దూరంలోని గురుడిని చేరుకోవడానికి అంతరిక్ష నౌక ఏకంగా 5.5 ఏళ్ల పాటు ప్రయాణించనుంది. 2030 నాటికి జూపిటర్ కక్ష్యలోకి చేరుకుంది. నిజానికి ఈ ప్రయోగం గత వారం ప్లాన్ చేసినప్పటికీ.. మిల్టన్ హరికేన్ కారణంగా నిలిపేయబడింది.
Io on steroids: ఖగోళ శాస్త్రవేత్తలు విశాల విశ్వంలో మనకు తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి. సౌర కుటుంబం వెలుపల ఉన్న గ్రహాలపై శాస్త్రవేత్తలకు ఎప్పటి నుంచో ఆసక్తి నెలకొని ఉంది.
Planet Parade: జూన్ నెలలో ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోబోతోంది. ఒకే వరసలోకి ఆరు గ్రహాలు రాబోతున్నాయి. భూమి నుంచి చూసినప్పుడు ఈ గ్రహాలన్నీ ఒకే సరళరేఖపై ఉన్నట్లు కనిపిస్తాయి.
NASA: బృహస్పతి రహస్యాన్ని ఛేదించేందుకు నాసా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నాసా అంతరిక్ష నౌక జునో.. బృహస్పతి భయంకరమైన 'ముఖాన్ని' తన కెమెరాలో బంధించింది. ఇటీవల నాసా ఈ చిత్రాలను విడుదల చేసింది.
Jupiter: సౌరకుటుంబంలో అతిపెద్ద గ్రహం, భారీ వాయుగోళం గురుగ్రహంపై మరోసారి ఫ్లాష్ లైట్ కనిపించింది. ఎప్పుడు చూడని విధంగా ఈ ఫ్లాష్ ఉంది. ఇలాగే గతంలో అంతరిక్ష వస్తువులు గురుగ్రహంలో కూలిపోవడంతో భారీ వెలుగులు కనిపించాయి. తాజా నమోదైన ఈ వెలుగు, ఇది వరకు ఎప్పుడూ చూడని విధంగా ఉందని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. ఆగస్టు 28న ఇది రికార్డ్ అయింది.
Jupiter: సౌర కుటుంబంలో అత్యంత పెద్ద గ్రహం గురుగ్రహం. దాదాపుగా 1300 భూమిలను తనలో ఇముడ్చుకోగలదు. సూపర్ గ్యాస్ జాయింట్ అయిన గురుగ్రహం సౌరకుటుంబంలో ‘వాక్యూమ్ క్లీనర్’గా పనిచేస్తుంటుంది. తన అపారమైన గురుత్వాకర్షణ శక్తితో గ్రహశకలాలను, తోకచుక్కలను తనవైపు ఆకర్షిస్తుంటుంది.
Venus and Jupiter, Moon conjunction: ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒకానొక సందర్భంలో ఒకే సరళరేఖలోకి వస్తుంటాయి. వీటిని ప్లానెటరీ కంజెంక్షన్ (గ్రహాల సంయోగం)గా అభివర్ణిస్తుంటాం. తాజాగా శుక్రుడు, గురుడు, చంద్రుడు ఒకే చోటుకు రాబోతున్నారు. నిజానికి ఈ మూడు గ్రహాల మధ్య మిలియన్ కిలోమీటర్ల దూరం ఉన్నా.. ఆకాశంలోకి చూసేటప్పుడు ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లు, లేదా పక్కపక్కన ఉన్నట్లు కనిపిస్తుంటాయి. జ్యోతిష్యపరంగా కూడా ఇలాంటి గ్రహాల…
12 new moons found around Jupiter: గురు గ్రహం సౌరవ్యవస్థలో సూర్యుడి తర్వాత అతిపెద్ద గ్రహం. సైన్స్ ప్రకారమే కాకుండా.. పురాణాల్లో, జోతిష్య శాస్త్రంలో గురుగ్రహానికి ప్రముఖ స్థానం ఉంది. శుభాలకు కారకుడిగా బృహస్పతి గ్రహాన్ని భావిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా గురు గ్రహం చుట్టూ తిరుగుతున్న 12 కొత్త చంద్రులను కనుక్కున్నారు.
Celestial Wonder: ఫిబ్రవరిలో ఖగోళ అద్భుతం దర్శనమివ్వబోతోంది. గత 50,000 ఏళ్లుగా కనిపించని కొత్త తోకచుక్క C/2022 E3 (ZTF) రాబోయే కొన్ని వారాల్లో కంటికి కనిపించనుంది. ఫిబ్రవరి 2న భూమికి అత్యంత దగ్గరగా రాబోతోంది. రాత్రి ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించబోతోంది. నాసా ప్రకారం.. జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీలోని వైడ్-ఫీల్డ్ సర్వే కెమెరా ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు ఈ తోకచుక్కను గతేడాది మార్చిలో గుర్తించారు. ప్రస్తుతం ఈ తోకచుక్క గురు గ్రహం కక్ష్యలో ఉంది.