జైలులో డేరా బాబాకు అస్వస్థత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్విలపై అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో.. రోహ్‌తక్‌లోని సునేరియా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. అయితే, ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు… తన కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో.. జైలు అధికారులు డేరా బాబాను ఉదయం 7 గంటల సమయంలో రోహ్‌తక్‌లోని పీజీఐఎంఎస్ ఆస్పత్రికి భారీ పోలీసు భద్రత మధ్య తరలించారు.. ఆస్పత్రిలో వైద్యులు డేరా బాబాకు వివిధ పరీక్షలు నిర్వహించిన తర్వాత.. తిరిగి ఆయనను జైలుకు తరలించారు. అయితే, డేరా బాబా ఆస్పత్రిలో చేరడం ఇది తొలిసారి కాదు.. మే 12వ తేదీన కూడా తనకు బాగాలేదని చెప్పడం, బీపీ హెచ్చుతగ్గులతో పీజీఐఎంఎస్ ఆస్పత్రిలో చేర్పించారు అధికారులు.. ఏడుగురు డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించి.. ఒకరోజు ఆస్పత్రిలో ఉన్న ఆయనకు అదనపు భద్రత ఏర్పాటు చేశారు.. మరుసటి రోజు తిరిగి జైలుకు తరలించారు. ఇప్పుడు మరోసారి అస్వస్థకు గురయ్యారు. ఇక, షుగర్, బీపీతో బాధపడుతున్న రామ్ రహీమ్.. రెగ్యులర్‌గా మందులు కూడా తీసుకుంటున్నారని చెబుతున్నారు. కాగా, సాధ్విలపై అత్యాచారం కేసులో.. ఆయనకు కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే.
Also Read
- E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
తాజావార్తలు
-
WTC Final: భారత్ ఫైనల్ చేరడానికి ఇదొక్కటే మార్గం.. ఇలా చేయకపోతే ఇంటికే..
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
-
E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!