Rajasthani Man Wrote A Marriage Letter To CM Relief Camp: పెళ్లీడుకొచ్చాక ఎవరైనా ఏం చేస్తారు? అమ్మాయిల్ని వెతకడం మొదలుపెడతారు. తమ కోసం ఒక మంచి అమ్మాయిని వెతికి పెట్టమని తల్లిదండ్రుల్ని కోరుతారు. వీలైతే తెలిసిన వారిని అడగడం, అప్పటికీ దొరక్కపోతే బ్రోకర్ సహకారం తీసుకోవడం చేస్తారు. ఈ మార్గాలు కాకపోతే.. మ్యారేజ్ వెబ్‌సైట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మార్గాలన్నింటిలో ప్రయత్నాలు చేస్తే, తప్పకుండా తాము కోరుకుని భాగస్వామి దొరుకుతుంది. కానీ.. తనకు అమ్మాయి దొరకడం లేదని ఓ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఏకంగా ప్రభుత్వానికే లేఖ రాశాడు. తాను పెళ్లి చేసుకుంటానని, ఓ మంచి అమ్మాయిని వెతికిపెట్టమని ఆ లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదండోయ్.. కొన్ని కండీషన్స్ కూడా పెట్టాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Pranitha Subhash: బ్లాక్ శారీలో నడుమందాలతో మెస్మరైజ్ చేస్తున్న ప్రణీత..
రాజస్థాన్‌లోని దుబ్బి గంగద్‌వాడి గ్రామానికి చెందిన మహవర్ అనే వ్యక్తికి 40 ఏళ్లు వచ్చినా, ఇంట్లో సమస్యల కారణంగా పెళ్లి కాలేదు. కొంతకాలం నుంచి అమ్మాయి కోసం వెతకడం ప్రారంభించారు కానీ, అతనికి వయసుకి తగ్గ అమ్మాయి దొరకట్లేదు. వయసు ఎక్కువగా ఉండటంతో, పెళ్లిచూపుల్లో చూసిన అమ్మాయిలు అతడ్ని రిజెక్ట్ చేశారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి సెట్ కాకపోవడంతో విసుగుచెందిన మహవర్.. రాజస్థాన్ ముఖ్యమంత్రి సహాయక శిబిరానికి ఓ లేఖ రాశాడు. ‘సార్, పెళ్లికి పిల్ల దొరకట్లేదు, దయచేసి ఓ పిల్లని వెతికి పెట్టండి మహాప్రభో’ అంటూ ఆ లేఖలో వేడుకున్నాడు. అంతటితో ఆగకుండా.. నాలుగు కండీషన్స్ కూడా పెట్టాడు. అమ్మాయి సన్నగా ఉండాలి, చూడ్డానికి అందంగా ఉండాలి, నాయకత్వ లక్షణాలు తప్పకుండా ఉండాలి, అమ్మాయి వయసు 30 నుంచి 40 మధ్యలో ఉండాలి. ఇవే అతని కండీషన్స్.
Dead body in drum: వీడిన డ్రమ్ములో డెడ్ బాడీ మర్డర్ మిస్టరీ.. చంపింది ఎవరంటే?
ఇంటి సమస్యల కారణంగా.. తనకు 40 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోలేదని, దయచేసి తనకోసం ఓ పిల్లని సెట్ చేయాలని కోరుతూ మహవర్ లేఖ రాశాడు. ఈ లేఖ చూసిన అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తమకు ఓ విచిత్రమైన అభ్యర్థన వచ్చిందని క్యాప్షన్ పెట్టి, అధికారిక ట్విటర్ ఖాతాలో లేఖను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరోవైపు.. ఈ లేఖపై విచారణ జరపాలని అధికారులు ఆదేశించారు.