కన్నడ హీరోయిన్ ప్రణిత సుభాష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.. పవన్ కళ్యాణ్ సరసన కూడా ఓ సినిమా చేసింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడు కేరీర్ పీక్స్ లో ఉంటుందని అనుకున్నారు.. కానీ ఈమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు.. దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ విషయాలను, లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వచ్చింది..
ఆ తర్వాత తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. కొద్ది రోజులకు పెళ్లి చేసుకుంది.. 2021 మేలో వ్యాపార వేత్త నితిన్ రాజును ప్రణీత పెళ్లి చేసుకుంది. ఇరు సంప్రదాయ పద్ధతుల్లో వెడ్డింగ్ జరిగింది. కోవిడ్ కారణంగా ఎలాంటి ఆడంభరాలు లేకుండా వివాహ వేడుక ముగిసింది. ఇక గతేడాది జూన్ 10న పండంటి ఆడబిడ్డకు కూడా ప్రణీత జన్మనిచ్చింది. తల్లిగా ప్రమోషన్ పొందింది.. చాలా కాలం తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ అందాల రచ్చ చేస్తోంది. పెళ్లై, కూతురు పుట్టిన ఏమాత్రం తగ్గని గ్లామర్ తో మంత్రముగ్ధులను చేస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ శారీలో దర్శనమిచ్చింది. స్లిమ్ ఫిట్ అందాలకు సరిపడేలా చీరకట్టి అందాలను ప్రదర్శించింది.. నడుమందాల తో మెస్మరైజ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.. ప్రస్తుతం ఆ ఫోటోలు ఫ్యాన్స్ లైక్స్, కామెంట్ల తో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ప్రణీత సినిమాల విషయానికొస్తే ఈ ముద్దుగుమ్మ కన్నడలో రూపుదిద్దుకుంటున్న ‘రమణ అవతార’లో నటిస్తోంది. అలాగే మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ అక్కడి సూపర్ స్టార్ దిలీప్ 148 వ చిత్రంలోనూ కథానాయికగా నటిస్తుంది.. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి..