Rajasthan: రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం.. సీఎం, మంత్రుల కంచుకోటల్లో బీజేపీకి షాక్..
- రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం..
- సీఎం, మంత్రులు కంచుకోటల్లో బీజేపీకి షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ గ్రామీణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీపై బలమైన మెజారిటీని సాధించింది. బీజేపీకి దారుణ పరాజయం ఎదురైంది. జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయాన్ని సాధించింది. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సొంత జిల్లాతో పాటు పలువురు మంత్రులు కంచుకోటల్లో కాంగ్రెస్ సత్తా చాటింది.
కాంగ్రెస్ అద్భుత విజయం..
గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ బీజేపీని దారుణంగా దెబ్బతీసింది. దాదాపు 24.8 మిలియన్ల ఓటర్లు ఇచ్చిన తీర్పులో జైపూర్, జోధ్‌పూర్, బికనీర్, భిల్వారా వంటి ప్రధాని జిల్లాల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ అజ్మేర్, ఉదయ్‌పూర్ ప్రాంతాలను దక్కించుకుంది. బీజేపీకి కంచుకోటలుగా భావించే చిత్తర్గఢ్, సిరోహి, రాజ్ సమంద్, జలోర్ వంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది.
Also Read
- India Rafale Jets: 4 రాఫెల్ జెట్లు మిస్సింగ్.. బ్రిటీష్ నివేదికపై మాజీ ఎయిర్ మార్షల్ ఫైర్!
- Pakistan ISI Honey Trap: విడాకులు తీసుకున్న, నిరుద్యోగ భారతీయ మహిళలే టార్గెట్.. పాకిస్తాన్ ఐఎస్ఐ హనీట్రాప్!
- Supreme Court: కార్తీక దీపానికి సుప్రీంకోర్టు అనుమతి.. విజయ్ సర్కార్‌కు ఎదురుదెబ్బ..
- Uttar Pradesh: ఇంటి ముందు ‘‘వందేమాతరం’’ ఉండటమే పాపమా.. ముస్లిం యువతి నికాహ్కు నిరాకరించిన ఇమామ్
రాజస్థాన్‌లోని 37 జిల్లాల్లో 419 పంచాయతీ సమితుల పరిధిలోని 475 జిల్లా పరిషత్ సభ్యులకు, 7543 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే, నాలుగు జిల్లాల ఫలితాలు ప్రస్తుతం నిలిపేశారు. డిసెంబర్ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో పాటు వీటిని విడుదల చేయనున్నారు. 37 జిల్లా పరిషత్ స్థానాలకు కాంగ్రెస్ 25, బీజేపీ 8, స్వతంత్రులు/ ఇతరులు 3 స్థానాలు గెలుచుకున్నారు. గతసారి 29 జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరిగితే బీజేపీ 46, కాంగ్రెస్ 10 స్థానాలు గెలుచుకున్నాయి. మొత్తం 419 పంచాయతీ సమితి స్థానాలకు గాను, కాంగ్రెస్ 213, బీజేపీ 85, స్వతంత్రులు 56 పంచాయతీ సమితులను గెలుచుకున్నారు.
యూజీసీ అంశంతో బీజేపీకి గట్టి దెబ్బ..
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సంప్రదాయ ఓట్ బ్యాంక్ అయిన ఎస్సీ, జాట్, గుర్జర్, మీనా వర్గాలతో పాటు బీజేపీ సంప్రదాయ రాజ్‌పుత్ ఓట్ బ్యాంక్‌లోకి కూడా చొచ్చుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ ఈ సామాజిక వ్యూహాన్ని చక్కగా అమలు చేసి సక్సెస్ అయింది. పంచాయతీ ఎన్నికల సమయంలో స్వతంత్ర ఎమ్మెల్యే రవీంద్ర సింగ్ భాటి నిర్వహించిన యూజీసీ వ్యతిరేక ర్యాలీ ప్రభావం గ్రామీణ ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. అంతేకాకుండా, హనుమాన్ బెనివాల్, రాజ్‌కుమార్ రోత్ నేతృత్వంలోని పార్టీలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో బలమైన ఉనికిని నెలకొల్పి, గణనీయమైన సంఖ్యలో సీట్లను గెలుచుకున్నాయి.
ముఖ్యమంత్రి, మంత్రుల కంచుకోటల్లో బీజేపీ పరాజయం..
అధికారంలో ఉండీ కూడా దారుణ ఓటమిని బీజేపీ మూటకట్టుకుంది. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సొంత నియోజకవర్గమైన సంగనేర్‌లో పంచాయతీ సమితి స్థానాన్ని ఆర్ఎల్పి గెలుచుకోగా, ఆయన సొంత జిల్లా అయిన భరత్‌పూర్‌లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ నియోజకవర్గమైన జోధ్‌పూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్ నియోజకవర్గమైన బికనీర్, మరియు భూపేంద్ర యాదవ్ నియోజకవర్గమైన అల్వార్లలో కూడా బీజేపీ ఓటమి చవిచూసింది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
రాజస్థాన్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఝబర్ సింగ్ ఖర్రా కుటుంబం మొత్తం ఎన్నికల్లో ఓడిపోయింది. ఆయన భార్య, ఇద్దరు కుమారులు పరాజయం పాలయ్యారు. మరోవైపు, పరిశ్రమల శాఖ మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోర్ నియోజకవర్గమైన ఝోత్వారా పంచాయతీ సమితిలో బీజేపీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Rajasthan: రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం.. సీఎం, మంత్రుల కంచుకోటల్లో బీజేపీకి షాక్..
-
India Rafale Jets: 4 రాఫెల్ జెట్లు మిస్సింగ్.. బ్రిటీష్ నివేదికపై మాజీ ఎయిర్ మార్షల్ ఫైర్!
-
YS Jagan: రామాయపట్నం పోర్టుకు కస్టమ్స్ గుర్తింపు.. హర్షం వ్యక్తం చేసిన జగన్..
-
Pakistan ISI Honey Trap: విడాకులు తీసుకున్న, నిరుద్యోగ భారతీయ మహిళలే టార్గెట్.. పాకిస్తాన్ ఐఎస్ఐ హనీట్రాప్!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!