Site icon NTV Telugu

High Alert In Rajasthan: రాజస్థాన్లో హైఅలర్ట్.. సాయంత్రం 5గంటలకే బ్లాకౌట్!

Rajastan

Rajastan

High Alert In Rajasthan: భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ లో హై అలర్ట్ ప్రకటించారు. జై సల్మేర్, రాంఘడ్, బడ్ మేర్, ఫలోది, పోక్రాన్, బికనీర్, గంగానగర్ లో లాంటి సరిహద్దు జిల్లాల్లో బ్లాక్‌ అవుట్ విధించబడింది. సాయంత్రం 5 గంటల నుంచి జనం ఇళ్లలోనే ఉండాలని భారత్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. అయితే, నిన్నటి మాదిరిగా ఇవాళ కూడా జై సల్మేర్ లో పాక్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరికలు చేసింది.

Read Also: IPL 2025 Suspended: ఐపీఎల్‌ 2025 వాయిదాపై బీసీసీఐ అధికారిక ప్రకటన.. వారం రోజులు..!

అయితే, రాజస్థాన్‌లో గురువారం రాత్రి 9 గంటల నుంచి సైరన్లు మోగడంతో.. నగరంలో బ్లాక్‌ అవుట్ విధించారు. దీంతో మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కేవలం 10 నిమిషాల తర్వాత నగరం చుట్టూ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో నగర వాసులు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుళ్లు అర్థరాత్రి వరకు వినిపించాయని స్థానికులు పేర్కొన్నారు. పాక్ దాడులకు ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

Exit mobile version