NTV Telugu Site icon

Rajasthan: గాడి తప్పిన గురువులు.. క్లాస్‌రూమ్‌లో ప్రిన్సిపాల్, టీచర్ అసభ్య ప్రవర్తన

Rajasthan

Rajasthan

విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన గురువులే గాడి తప్పుతున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన మార్గదర్శకులు కామపిశాచుల్లా తయారవుతున్నారు. క్లాస్ రూముల్లోనే శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. ఈ దారుణం రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Noida : లోపల ప్రియురాలి పెళ్లి.. వేదిక వెలువల కారులో ప్రియుడి సజీవ దహనం

చిత్తోర్‌గఢ్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు క్లాస్ రూములో అసభ్య ప్రవర్తనకు పూనుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖ సీరియస్ అయింది. ఇద్దరిని తాత్కాలికంగా ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసింది. ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి రాజేంద్ర కుమార్ శర్మ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని పరిశీలించడానికి ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని నియమించారు. నివేదికను వారంలోపు సమర్పించాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Karnataka : కర్ణాటకలో దారుణం.. 15ఏళ్ల కూతురిని బలవంతంగా 45ఏళ్ల వ్యక్తికి కట్టబెట్టిన తండ్రి