Noida : తూర్పు ఢిల్లీలోని గాజీపూర్‌లో ఓ వ్యక్తి కారులోనే సజీవ దహనమయ్యాడు. శనివారం రాత్రి ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్ళిన క్యాబ్ డ్రైవర్ అనిల్ (24) అనుహ్యంగా మంటల్లో చిక్కుకొని మృతి చెందాడు. అనిల్ నోయిడాకు చెందిన క్యాబ్ డ్రైవర్. అతను ఫంక్షన్ హాల్ వెలుపల వాహనంలో వెళ్ళి, అటు వద్దనే వాహనం మంటల్లో చిక్కుకోవడంతో అతను కాలిపోయాడు. బాధితుడు కాలిపోయిన తరువాత పోలీసుల దర్యాప్తులో తను లవ్ ఎఫైర్ కారణంగా హత్య చేయబడినట్లు.. ప్రియురాలి తండ్రి వారి సంబంధాన్ని అంగీకరించకపోవడంతో అమ్మాయి తరపు వాళ్లే అనిల్ ను హత్య చేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Read Also:Jagga Reddy: రివైంజ్ పాలిటిక్స్‌పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు ఢిల్లీ) అభిషేక్ ధనియా మాట్లాడుతూ.. వాహనంలో మంటలు వ్యాప్తి చెందినట్లు గాజీపూర్ పోలీస్ స్టేషన్‌కు వరుసగా మూడు కాల్స్ వచ్చాయి. “కొంతమంది కారులోంచి బయటకి తీసినప్పటికీ అనిల్ మృతదేహం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది” అని ధనియా చెప్పారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించడంతో పాటు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందాలను కూడా పిలిపించారు. అనిల్ మృతదేహాన్ని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అనిల్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనిల్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా సోదరులు అమ్మాయి తరఫు వాళ్లే హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం కోసం పోస్ట్ మార్టం నివేదికలు ఇంకా అందుబాటులో లేవు. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.
Read Also:Baba Ramdev: బాబా రామ్‌దేవ్, బాలకృష్ణకు కేరళ కోర్టు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ