Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Raj Thackeray Fire On Shiva Sena Governmet Uniform Civil Code Aurangabad Name Change

Raj Thackeray: మోదీజీ యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురండి, ఔరంగాబాద్ పేరు మార్చండి

Published Date :May 22, 2022 , 1:16 pm
By Venu Goapl Reddy
Raj Thackeray: మోదీజీ యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురండి, ఔరంగాబాద్ పేరు మార్చండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే తాజాగా పుణేలో మార్చ్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పోలీసులు భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంపై వరసగా విమర్శలు చేస్తున్నారు రాజ్ ఠాక్రే. మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలని మహారాష్ట్ర సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు.

తాజాగా ఆదివారం పూణేలోని గణేష్ కళా క్రీడా మంచ్ లో భారీ ర్యాలీ నిర్వహించారు రాజ్ ఠాక్రే. ఈ ర్యాలీలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని.. ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా మార్చాలని ప్రధానిని కోరారు. జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు రాజ్ ఠాక్రే. రెండు రోజుల క్రితం నా అయోధ్య పర్యటనను వాయిదా వేస్తూ ట్వీట్ చేశానని… ప్రతీ ఒక్కరూ తమ స్పందనను తెలియజేయడానికే ఉద్దేశపూర్వకంగా ప్రకటన ఇచ్చానని.. నా అయోధ్య టూర్ ను వ్యతిరేఖిస్తున్న వారు నన్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. నేను ఆ ట్రాప్ లో పడనని రాజ్ ఠాక్రే అన్నారు.

మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీసేయాలని.. లేకపోతే హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని నేను చెప్పిన తర్వాత  నవీనీత్ రాణా దంపతులు హనుమాన్ చాలీసా పఠిస్తామని అన్నారని… సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీ ఏమైనా మసీదా..? అంటూ రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. శివసైనికులు, రాణా దంపతులకు మధ్య ఏం జరిగిందో అందరికీ తెలుసని రాజ్ ఠాక్రే అన్నారు. శివసేన ప్రభుత్వంపై రాజ్ ఠాక్రే కీలక విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీని పెద్ద పార్టీగా చేశారని మండిపడ్డారు.

కాగా… రాజ్ ఠాక్రే ర్యాలీకి అనుమతి కోసం పుణే పోలీసులు 13 ఆంక్షలు విధించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, కార్యకర్తలు ఎటువంటి మారణాయుధాలు తీసుకురావద్దని, లౌడ్ స్పీకర్ల శబ్ధ తీవ్రత సుప్రీం కోర్ట్ ఆర్డర్ కు లోబడి ఉండాలని నిబంధనలు విధించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • MNS
  • Raj Thackeray
  • shiva sena
  • uddav thackeray
  • Uniform Civil Code

తాజావార్తలు

  • Minister Subhash Father: 15 మంది రౌడీలతో దారుణంగా కొట్టాడు.. మంత్రి వాసంశెట్టి తండ్రిపై మాజీ సర్పంచ్ సంచలన ఆరోపణలు!

  • RCB: ఆర్సీబీ విజయాలకు ముఖ్య కారణం ఈ 5 గురే.. వేలంలో తక్కువ ధరకు వచ్చి.. దుమ్ము లేపుతున్న గెలుపు గుర్రాలు..

  • Opinion Poll 2026: బెంగాల్‌లో గెలుపు బీజేపీదా, టీఎంసీదా.. ఒపీనియన్‌ పోల్స్‌లో సంచలన ఫలితాలు..

  • PM Kisan Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు! ఎంత పడతాయంటే..

  • Insurance Price: తగ్గనున్న ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు.. మోటార్, హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్‌లు ఇక తక్కువ ధరలోనే..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions