Bharat Jodo Yatra: నేటి నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi’s Bharat Jodo Yatra launch today: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ నేడు ప్రారంభం కాబోతోంది. కన్యాకుమారిలో బుధవారం యాత్ర ప్రారంభం కాబోతోంది. అంతకుముందు రాహుల్ గాంధీ శ్రీపెరంబుదూర్ లోని రాజీవ్ గాంధీ స్మారక చిహ్నం వద్ద నివాళి అర్పించనున్నారు. మొత్తం 3,570 కిలోమీటర్లు, 150 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఐదు నెలల్లో 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా పాదయాత్ర కొనసాగనుంది.
కన్యాకుమారిలో ప్రారంభమయ్యే ఈ యాత్రకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు చత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ బఘేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ హాజరుకానున్నారు. స్టాలిన్ ఖాదీతో చేసిన జాతీయ జెండాను రాహుల్ గాంధీకి బహూకరించనున్నారు. యాత్ర కోసం మంగళవారం సాయంత్రమే రాహుల్ గాంధీ చెన్నై చేరుకున్నారు. ఇది ఎన్నికల కోసం కాదని.. భారత్ ను ఏకం చేయడానికి అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. నేడు ప్రారంభమయ్యే ఈ యాత్ర జమ్మూ కాశ్మీర్ లో ముగియనుంది. బీజేపీ ప్రభుత్వ హయాంలో పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్భనం, పెట్రోల్ రేట్లు, నిరుద్యోగం, చైనా దురాక్రమణ వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రశ్నించనుంది.
Also Read
Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీ చెత్త రికార్డు.. ఆసియా కప్‌లోనే తొలి ఆటగాడు..!!
ఈ యాత్రంలో భాగంగా యాత్రలో పాల్గొనే వారు ఎక్కడా కూడా ఏ హోటల్లో బస చేయరు. వీరి కోసం ప్రత్యేకంగా కంటైనర్లను సిద్ధం చేశారు. మొత్తం 60 కంటైనర్లను ఏర్పాటు చేశారు. వీటిలోనే బెడ్లు, టాయిలెట్లు ఉండనున్నాయి. యాత్రలో పాల్గొనేవారు రోడ్డుపైనే భోజనం చేయడంతో ప్రజలతో మమేకం కానున్నారు. ప్రతీరోజు 6 నుంచి 7 గంటల పాటు యాత్ర కొనసాగనుంది. కన్యా కుమారి నుంచి ప్రారంభం అయిన యాత్ర తిరువనంతపురం, కొచ్చి, నిలంబూర్, మైసూరు, బళ్లారి, రాయచూర్, వికారాబాద్, నాందేడ్, జల్గావ్ జామోద్, ఇండోర్, కోట, దౌసా, అల్వార్, బులంద్‌షహర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్‌కోట్, జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల గుండా యాత్ర సాగనుంది. కేరళలో 18 రోజుల పాటు, కర్ణాటలో 21 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది.
కాంగ్రెస్ పార్టీలో భారత్ జోడో యాత్ర సరికోత్త జోష్ ఇస్తుందని నేతలు భావిస్తున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్లు గడువు ఉండటంతో ఈ లోపు పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే వరస పరాజయాలు, నేతల తిరుగుబాట్లు, ప్రముఖుల పార్టీ మార్పులతో కాంగ్రెస్ పార్టీ ఢీలా పడింది. గత వైభవాన్ని తిరిగి పొందేందుకు ఈ భారత్ జోడో యాత్ర సహాయపడుతుంది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.
.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!