Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
- 2014 ఎన్నికల్లోనే ఏదో తప్పు జరిగిందని భావించా..
- ఎన్నికల్ని బహిష్కరిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం..
- చికాగో యూనివర్సిటీలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. చికాగో యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో భారత ఎన్నికల వ్యవస్థపై కామెంట్స్ చేశారు. ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని భావిస్తే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్ని ఎందుకు బహిష్కరించలేదని ఒక విద్యార్థి రాహుల్ గాంధీని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా రాహుల్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లోనే ఏదో తప్పు జరిగిందని తాము భావించామని, కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటముల మెజారిటీలు వివరించలేనివిగా ఉన్నాయని ఆయన అన్నారు. అయితే, అప్పట్లో తమ వద్ద ఆధారాలు లేకపోవడంతో రాజకీయంగా ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేకపోయామని అన్నారు.
కాంగ్రెస్ లోని రాజకీయ నాయకులకు ఆధారాలు చూపించినప్పటికీ, ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దని వారు తనకు సూచించినట్లు రాహుల్ వెల్లడించారు. భారత ప్రజాస్వామ్యం తమకు పవిత్రమైందని, ప్రజాస్వామ్యంలో సమస్య ఉందని చెప్పాలంటే 300 శాతం ఖచ్చితమైన ఆధారాలు ఉండాలని ఆయన అన్నారు.
Also Read
- Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్!
- AP-Tamil Nadu: తమిళనాడు పెట్టుబడుల రహస్యాలు ఏపీకి లీక్.? 15 మంది అధికారులపై విజయ్ సర్కార్ వేటు..
- National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
- Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు కష్టకాలం.. సిందూర్‌పై కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ఎన్నిలక బహిష్కరణపై..
ఎన్నికల బహిష్కరణపై మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయిస్తే, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వేలాది మంది కార్యకర్తల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయడం ఆపేస్తే ఆ క్షణమే ప్రజాస్వామ్యాన్ని అంతం చేసినట్లు అవుతుందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణాన్ని తాము విచ్ఛిన్నం చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, వ్యవస్థలోని లోపాలు బయటపెట్టడం తమ వ్యూహమని, భారత ప్రజలు ఎన్నికల వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని గుర్తించే వరకు తాము ఎదురుదెబ్బలు ఎదుర్కొంటూనే పోరాటం కొనసాగిస్తామన్నారు.
ఎన్నికల సంఘం అధికార పార్టీ బీజేపీతో కుమ్మకై పనిచేస్తోందంటూ అందులోని సీనియర్ అధికారులు తమకు అంతర్గత సమాచారం అందిస్తున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీకి చెందిన సీనియర్ మంత్రులు కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, తమకు సమాచారం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
-
ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది’ అప్పుడు జరిగిన ఆ అవమానాన్ని బయటపెట్టిన విశ్వక్ సేన్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!